ఐ లవ్ యూ డ్రీమ్ బాయ్

ఐ లవ్ యూ డ్రీమ్ బాయ్

రచన:  ఎన్.ధన లక్ష్మి

చూడు సింధు…ఇప్పుడు వస్తున్న పెళ్ళి వారు మీ నాన్న గారికి ఎంతో కావలసిన వారు  నీ పిచ్చి మాటలతో, చేష్టలతో ఇబ్బంది పెట్టకుండా ఉండు ఇంకో ముఖ్య  విషయం దించిన తల ఎత్తకు అర్థం అయిందా అని సింధుకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది వాళ్ళమ్మ మీనాక్షి.”

 ” అమ్మ! ఇక్కడ ఉండేది సింధు అంత ఈజీగా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అనుకున్నవు అసలు.నా డ్రీమ్ బోయ్ తోనే నా పెళ్లి జరగాలి”

పెళ్లి వారు వచ్చారు ..త్వరగా అమ్మాయిని తీసుకొని రా మీనాక్షి అని కేక వేశారు సూర్యం గారు

  సింధు సైలెంట్ గా వచ్చి అందరికీ కాఫీలు ఇచ్చింది..

” ఏమ్మా! మా వాడు నీకు నచ్చాడా!? అని అటు పెళ్లి కొడుకు తండ్రి, ఇటు సింధు వాళ్ళ నాన్న సూర్యం గారు అడుగుతున్నారు..

” ఏంట్రా! నీకు అమ్మాయి నచ్చిందా అని పెళ్లి కొడుకును అడిగారు…”

ఇటు సింధూ తల ఎత్తకుండా కామ్ గా ఉంది..
అటు వచ్చిన అబ్బాయి కూడా సైలంట్ గా ఉన్నాడు..

మీనాక్షి మనసులో “ఇదేంటి! ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది..నేను ఇలా ఉండమన్నా అని వాళ్ళ నాన్నకి చెపితే ఇంకా ఏమైనా ఉందా!..నన్ను ఇంటి నుండి గెంటి వేస్తాడు”

” అన్నయ్య గారు పిల్లలిద్దరూ మన ముందర సిగ్గు పడుతున్నారు కాస్త వారిద్దరికీ ప్రైవసీ ఇద్దాము…”

” నిజమే చెల్లి ఎంత కాలం మారినా సరే కొన్ని ఫీలింగ్స్ మారవు లే…
అమ్మ సింధు అబ్బాయి కి కాస్త మన గార్డెన్ చూపించు అని సూర్యం గారు చెప్పడంతో పార్క్ వైపు అడుగులు వేసింది …

సింధూ వెంట తను కూడా వెళ్ళాడు…

సింధూ తల దించుకునే అక్కడన్నా కుర్చీలో కూర్చుంది.. ఆ అబ్బాయి కూడా కూర్చొన్నారు..

” సింధు వచ్చిన ఆ అబ్బాయి వైపు అసలు చూడకుండ!
చూడు!మిస్టర్ ఎక్స్…
ఇదేంటి ఇలా పిలుస్తుంది అనుకోకు..నాకు మీ పేరు తెలియదు,తెలుసుకునే ఇంటరెస్ట్ అంతకన్నా లేదు.
నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు..నేను ఈ మాట మా నాన్నతో అనలేను.ఆయన అంటే ఎంత ఇష్టమో అంతే భయం కూడా..తన మాటకి నేను ఎదురు చెప్పలేను అలా అని ఈ పెళ్ళి చేసుకోలేను
కాబట్టి నువ్వే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాలి..”

” మిస్ సింధూ! మీకు ఎందుకు ఈ పెళ్ళి ఇష్టం లేదో చెప్పండి..మీరు చెప్పే రీసన్ కన్వీనట్ గా  ఉంటే నేను ఆలోచిస్తా….”

” నేను లవ్ లో ఉన్న..”

” ఓహ్! ఒకే ఆ అబ్బాయి ఏం పని చేస్తాడు,ఎక్కడ ఉంటాడు…”

” ఏమో! నాకు తెలియదు…ఇంకా చెప్పాలంటే తన పేరు కూడా నాకు తెలియదు మిస్టర్ ఎక్స్..”

” వాట్! మరి లవ్ లో ఉన్నాను అన్నావు..ఏమి తెలియకుండా లవ్ ఏంటి! కనీసం పేరు తెలియకుండా లవ్ ఏంటి!?”

” అవును ఉన్నాను … ఒన్ సైడ్ లవర్ ని…”

అసలు తమరి ఒన్ సైడ్ లవ్ స్టొరీ కాస్త చెప్పమ్మా విని
తరిస్తాను..

లాస్ట్ ఏడాది నేను బైక్ నడపడం కొత్తగ నేర్చుకున్న…
నాకు తోడుగా నా ఫ్రెండ్ బిందు వచ్చింది. అప్పుడు.

” ఒసేయ్! కొంచం స్లో గా నడుపవే తల్లి.
అసలే నాకు పెళ్ళి కూడా కాలేదు ఇంకా.,నీ వల్ల నాకు ఏమైనా అయి నేను చచ్చి పోతే దెయ్యం అయి నిన్ను పీడిస్తా జాగ్రత్త అంటు వాగుతు ఉంది బిందు..

సింధూ తన మాటలకు కంగారు పడి ఎదురుగా వస్తున్న లో ఉన్న అతనిని గుద్దేసింది..

  దెబ్బకి బిందు,సింధు కింద పడ్డారు.
శాపనార్థాలు పెట్టుకుంటు పైకిలేచింది బిందు..
కింద  పడడం పైగా తన ఓణీ స్కూటీ కి చిక్కుకుకోవడం వల్ల దానిని లాగే ప్రయత్నంలో సింధూ డ్రెస్ బ్యాక్ సైడ్ చినిగిపోయింది….తను లేవడానికి ఇబ్బంది పడుతుంటే ఎదురుగా ఉన్న అబ్బాయి తన వేసుకున్న టీ షర్ట్ తీసి ఇచ్చాడు ..
అప్పుడు చూసింది ఆ అబ్బాయిని …

అతని రూపం తన మదిలో అలా నిలిచిపోయింది..
ఆ అబ్బాయి వీరిని ఏమి అనుకుండ సైలెంట్ గా వెళ్ళిపోయాడు..

  ఇంకో సారి తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళింది.
అక్కడ హల్ది ఫంక్షన్ జరుగుతుంది..తన ఫ్రెండ్ కి పూసి అలాగే అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ అందరికీ సరదాగా పూస్తూ ఆ ఫంక్షన్ హాల్ మొత్తం తిరుగుతోంది సింధు…

  అలా పరుగుపెడుతు ఎదురుగా వస్తున్న అబ్బాయికి డాష్ ఇవ్వడం, తన చేతికి ఉన్న పసుపు ముద్రలు ఆ వ్యక్తి షర్ట్ కి అంటుకోవడం అన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోయాయి..

  సింధు భయపడుతూ ఎదురుగా ఉన్న అబ్బాయి ని చూసింది..

  ఆ అబ్బాయి సైలెంట్ గా వెళ్ళిపోయాడు.
అలా షాపింగ్ మాల్,కూరగాయల మార్కెట్ ఎక్కడకి వెళ్ళినా సరే ఆ అబ్బాయిని ఎదో విధంగా బాధ పెడుతునే ఉంది..

  తెలియకుండా ఆ అబ్బాయి ని ఇష్టపడడం మొదలు పెట్టింది..తనతో జీవితం పంచుకోవాలి అనుకుంది.
ప్రెసెంట్.
అలా నా డ్రీమ్ బాయ్ తో జీవితాన్ని ఊహించుకున్న..
నాన్న తో చెప్పాలి అనుకున్న.అతని పేరేంటో కూడా తెలియదు ఎలా మరి!??

  ఈ లోపు నువ్వు వచ్చి పడ్డావు మిస్టర్ ఎక్స్…
మిస్…

ఏమి తెలియకుండానే ఎలా ప్రేమించావు..

” మిస్టర్ ఎక్స్….
మొదటి మా పరిచయం లోనే నా పరువును కాపాడాడు…రెండో పరిచయంలో నా వల్ల షర్ట్ పాడు అయిన సరే నన్ను ఏమి అనలేదు…

  దీనిని బట్టి ఈజీ గా అర్థం చేసుకోవచ్చు తన ఏంటో, ఎదుటివారిని ఎంత బాగా అర్థం చేసుకుంటారు అనేది…..

ఒకేవేళ అతను తిరుగుబోతు, తాగబోతు ,అమ్మాయిల వెనక తిరిగే అబ్బాయి అయితే…

ఏమి అన్నావు మిస్టర్ ఎక్స్ అంటు కోపంగా  తల ఎత్తి   చూసి షాక్ అయింది…

  ఎదురుగా తన డ్రీమ్ బోయ్ నవ్వుతూ చూస్తున్నాడు..

  “మిస్! నన్ను ఇంత ఇష్టపడ్డావ.
మా నాన్నగారు, మీ నాన్నగారు కాలేజ్ ఫ్రెండ్స్…
మా ఇంటికి వచ్చినప్పుడు నీ ఫోటో చూపించారు .. అలా నేను నిన్ను చూశాను .. ప్రేమించడం మొదలు పెట్టాను..

 రోడ్ పై మన పరిచయం అనుకోకుండా జరిగింది.
నిన్ను కలిసిన ప్రతి సారి నా ప్రేమ విషయం చెప్పాలి అనుకున్న ఎదో తెలియని బిడియం నన్ను ఆపేది..
నా పై నీకున్న ప్రేమను చూసి చలించిపోయాను.
ఐ అనుకుంటూ సింధూ వైపు చూసాడు.

సింధు ఏమో సిగ్గు పడుతూ నేల పై ముగ్గులు వేస్తోంది…

  ఇంతలో బాబు విక్కి అంటు అరుపులు వినపడడంతో పరుగున లోపలికి వెళ్ళాడు..
సింధూ అసలు విషయం గుర్తుకు వచ్చి అక్కడే ఉండి గోళ్ళు కొరుకుతూ ఉండిపోయింది.

పాపం విక్కి పేరెంట్స్ కి ఆగకుండా మోషన్స్ అవుతునే ఉన్నాయి..

  వారిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు…
ఫుడ్ పాయిజన్ అయింది అని డాక్టర్ చెప్పారు..
వస్తున్న దారిలో ఎదో డాబా లో ఫుడ్ తిన్నారు.. ఆ ఎఫెక్ట్ కి ఇలా అయింది అని అనుకొన్నారు అంత..

  సింధూ,విక్కి పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకున్నారు..
సింధు కి విక్కి కి ఫోన్ చేసి
“మిస్టర్ ఎక్స్…. నువ్వే నా డ్రీమ్ బోయ్ అని తెలియక
ఎలా అయిన పెళ్ళి సంబంధం  తప్పించాలి అని మా ఇంట్లో డేట్ అయిపోయిన కాఫీ పౌడర్ ని వాడాను..అందు వల్లే  అత్తయ్య, మామయ్య లకు మోషన్స్ అయ్యాయి…

  నేను కావాలంటే అత్తయ్య, మామయ్యకు క్షమాపణ కోరుతాను..!?”

” క్షమాపణ ఏమి అక్కర్లేదు  కోడలు పిల్ల! నా కొడుకు కోసమే కదా ఇదంతా చేశావు..కానీ ఒక్కటి దయచేసి పెళ్ళి అయ్యాక నువ్వు వంట జోలికి  అసలు వెళ్ళకమ్మ అర్థం అయిందా! ఇదిగో అబ్బాయి కి ఇస్తాను మాట్లాడు…

” సో సారీ మామయ్య!అని గిల్టీ గా ఫీల్ అయింది మనసులో.

” హేయ్ సింధూ ఫోన్ చేసిన తరువాత ఎత్తింది ఎవరో కనుక్కోవా… అవును నాన్నతో ఏమి మాట్లాడవు? జాగ్రత్త రా అని నాకు చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు…..

  సింధూ అసలు విషయం చెప్పింది…
విక్కి కోపంగా ఫోన్ పెట్టేసాడు…

కొన్ని వందల సార్లు సారి చెప్తూ మెసేజ్ ,ఫోన్ చేసింది కానీ విక్కీ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు .

  పెళ్ళి తంతు  మొదలైంది..
కనీసం తెర తీసిన కూడా సింధు వైపు కన్నెత్తి చూడలేదు విక్కి..

మాంగళ్య ధారణ చేసి సింధు పక్కన కూర్చుని

‘ ఐ లవ్ యూ  సింధు ఈ ముక్క ఇక్కడ చెప్పాలనే నిన్ను ఇంత టెన్షన్ పెట్టాను..ఎలా ఉంది అనడంతో ఆనందం తట్టుకోలేక విక్కిని గట్టిగ హత్తుకొని
లవ్ యూ సో మచ్ రా…నన్ను ఎందుకు ఇంత ఏడిపించావు అంటు గుండెల పై కొట్టసాగింది ..
సింధు ఫ్రెండ్స్, విక్కీ ఫ్రెండ్స్ అందరు ఓ అని గట్టిగా అరవడంతో ఈ లోకం లోకి వచ్చింది సింధు..
..
పెళ్ళి తంతు మొత్తం పూర్తయింది…

ఆ రోజే వారి మొదటి రాత్రికి ఏర్పాట్లు చేశారు పెద్దలు
గది లోపలకి వచ్చి విక్కిని వేసుకున్న షర్ట్ ను చూసి ఆశ్చర్యపోయింది.. తను ఒక్కప్పుడు  వేసిన పసుపు ముద్రలు ఉన్న షర్ట్…

  ఈ షర్ట్ వల్లే మనకు అనుకోకుండా పసుపు కార్యక్రమం జరిగిపోయింది…ఇప్పుడు అదే షర్ట్  మన కొత్త జీవితానికి అందమైన వారధిగా నిలుస్తుంది..
సింధూ ప్రేమగా విక్కి ని గట్టిగ హత్తుకొని నుదుటిమీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ డ్రీమ్ బాయ్ చెప్పింది.

  హేయ్! పెట్టాల్సింది అక్కడ కాదు నేను చూపిస్తాను అంటు తనని ఎత్తుకుని బెడ్ పైకి చేరి తనలో ఐక్యం  చేసుకున్నాడు…
అలా సింధు విక్కి ప్రణయం మొదలైంది .

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!