నువ్వే ఓ ఆక్సిజన్ సిలిండర్..!?

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

నువ్వే ఓ ఆక్సిజన్ సిలిండర్..!?

రచయిత :: సోంపాక సీత

మానవత్వపు ముసుగేసుకున్న మోసాలన్నీ
మంచితనపు మేకప్ చెదరని
కలహంస నడకల హొయలే..!

ఆ కులుకుల నయగారాలన్నీ
గాలి,నీరు,ఆహారాన్ని సైతం అంగట్లో
అమ్మకానికిపెట్టి మూఢభక్తులకు
అమరత్వాన్ని అంటగట్టగల రాతిదేవుళ్లే..

కమ్ముకున్న ‘కలిమబ్బుల్ని’ ఛేదించే
వేకువకిరణం రానంతవరకు
బడాబాబుల చలిమంటల్లో ఊపిరాడక మగ్గుతున్న ముడిసరుకే మానవత్వం..!

ఏడువారాల నగల ఆహార్యంలో
స్వయంకృతాపరాధ ధూపాలశ్వాసల్లో
కృత్రిమ శ్వాసకు కూడా నోచుకోని
మానవత్వానికి ..’ఓ మనిషీ !
నువ్వే ఓ ఆక్సిజన్ సిలిండర్ గా మారాలి..!’
‘నువ్వే ఓ తొలిపొద్దుపొడుపువై
సహజ శ్వాసల వేకువకిరణమై భాసించాలి…!’

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!