కొద్దిగా ఆలోచించు

(అంశం:”అపశకునం”)

కొద్దిగా ఆలోచించు

రచన :: సుజాత.కోకిల

సుమతీ “సుమతీ  ఏంటి అంత పరధ్యానం ఎంత పిలిచిన పలకట్లేదు ఏమాలోచిస్తున్నావ్  అంటూ ! జ్యోతి వచ్చింది.ఆ .. హా ఏంలేదు ఏం లేదేంటే మరి అలా ఎందుకున్నావ్ ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటావు? మళ్లీ ఏం లేదంటావు ఎందుకు? నాతో కూడా చెప్పలేనిదా! అంది నిష్టూరంగా? అదేం లేదే నసుగుతూ అంది. జ్యోతి.సుమతి, మేనత్త మేనమామ పిల్లలు కాని ప్రాణంగా ఉంటారిద్దరూ ఎప్పుడు ఒకరికొకరు నీడలా వెన్నంటే ఉంటుూ.ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకుంటారు.

“నేను ఎలా చెప్పాలి? నన్ను అందరూ?అపశకునపక్షి అని అంటున్నారు.నేనేం పాపం చేశాను. నెేను పుట్టగానే నా తల్లితల్లిదండ్రులు కారు యాక్సిడెంటులో పోవడం నా తప్ప ? నా భర్త పోవడం కూడా నా తప్పేనా!ఎందుకు నాకీ పరీక్ష అంది.సుమతి ఏడుస్తూ,మనకు తెలియకుండా కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి.దానికి నువ్వేం చేస్తావ్ ? బాధపడకు అంది! “జ్యోతి”తను కూడా బాధ పడుతూ తన తల్లిదండ్రులు పోవడంతో! తన మేనమామ ఇంట్లో పెరిగింది.మామయ్య బాగానే చూసుకునేవాడు కానీ అత్తయ్యనెే కొద్దిగా పరాగ్గా ఉండేది!తన ఆస్తినంతా తనకే పెడుతున్నట్టుగా ఫీలవుతూ, నన్ను అనలేక మావయ్యను అంటుండేది.

కానీ మావయ్య పట్టించుకునేవాడు కాదు నాక్కూడా అదే చెప్పేవాడు ? నువ్వు కూడా ఏం పట్టిన్చుకోకమ్మ అలాగే అరుస్తుంది? నువ్వేం బాధపడకు అని చెప్తుండేవాడు. జ్యోతి కూడా ?తల్లిని వారించేది ఎందుకు అస్తమానం అంటావని కోప్పడినా వినేది కాదు? అలాంటి వాళ్ళకెంత చెప్పిన వేస్టెే అని ఊరుకునేది. సుమతి మామయ్యకు నచ్చే చెప్తుండేది నేనేం పట్టించుకోను.మామయ్య మీరేం బాధపడకండి అనేది.సుమతి జ్యోతి వుందిగా ! నాకు తోడు ఏం ఫర్వాలేదు.మామయ్యా మీరు లైట్ తీసుకోండి అనేది నవ్వుతూ

కట్నం ఎక్కువ ఇవ్వలేనంటూ అత్తయ్య వాల్ల తమ్మునికి ఇచ్చి చేసింది.తనకు ఇష్టం లేకున్నా బలవంతంగా చేసింది.మామయ్య అత్తకి ఎదురు చెప్పలేక అలా చూస్తుండి పోయాడు.నేను కూడా ఏమీ చేయలేని నిస్సహాయురాలిగా అలాగే తలవంచాను. తన తమ్మునికి జబ్బుందని చెప్పలేదు రోగిష్టి వానికిచ్చి చేశారు.నా దురదృష్టం కొద్దీ మూన్నాళ్ల ముచ్చటగా మిగిలి !భర్త కూడా పోయాడు నీది దురదృష్టం జాతకం అందుకే నిఖిలా అయింది. అంటూ, దెప్పి పొడుస్తుంది.నీవు పుట్టగానే’ తల్లిదండ్రులను పోగొట్టుకున్నావు భర్తను కూడా పోగొట్టుకున్నావు!
నీ దరిద్రమంతా మాకు పడుతుంది.

ఇంకా ఏన్నాళ్లు మా ఇంట్లోనే తిష్టవేస్తావు అపశకునపక్షి అంటూ, తిడుతుండెేది.ఆ తిట్లకు ఒక్కొక్క సారి చచ్చిపోవాలని పిస్తుంది.కానీ బాధపడడం తప్ప ఏం చేయలేను. నువ్వు మా ఇంట్లోనే ఉంటే నా బిడ్డకు సంబంధాలు వచ్చేవి రాకుండా పోతాయి. అంటూ దెప్పి పొడుస్తుంది.అయినా అన్నీ భరిస్తూ ఇంటి పనంతా తనే చేస్తుంది. ఒక్కొక్క సారి మాటలురాని మూగదానిలానే ఉంటుంది.

అమ్మా శాంతమ్మ అంటూ పెళ్లిళ్ల పేరయ్య వచ్చాడు?
ఆ రండి శాస్త్రిగారు కూర్చోండి ఏమే సుమతి ఎక్కడ చచ్చావు పంతులుగా రొచ్చారు కాఫీ పట్రా అంది. అలాగే అత్తయ్యా అంటూ కాఫీ తెచ్చి పంతులుగారికి ఇచ్చింది.ఎమ్మా సుమతి బావున్నావా అంటూ పలకరించారు.ఆ బాగున్నాను పంతులుగారు అంటూ నమస్కారం చేసింది.ఏమిటో నమ్మ నీ అదృష్టం ఇలా ఉంది అంటూ బాధపడ్డారు.మన చేతుల్లో ఏముంది పంతులుగారు అంది.

ఆ చెప్పండి పంతులుగారు ఏమైనా మంచి సంబంధాలు ఉన్నాయా అని అడిగింది చాలా మంచి సంబంధాలున్నాయి.మీరు హు అనండి అన్నీ చూపిస్తాను.అన్నాడు ? ఏమండీ ఇలా వస్తారా పంతులుగారు వచ్చారు.ఆ వస్తున్నాను ఎందుకలా అరుస్తావ్ అంటూ వచ్చారు. నమస్కారం పంతులుగారు అంటూ మా సుమతికి మంచిసంబంధం ఉంటే చూడండి అన్నారు.ఏంటి సుమతికా ఆ అవును ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తావు? అన్నారు. “ముకుందరావుగారు” ఆ ముదనష్టపు పెళ్లి చేసావుగా దానికి”.మళ్లీ పెళ్లేంటి అంటూ తిట్ల వర్షం కురిపించింది.

ఆ చేసావుగాని తమ్మునికిచ్చి నిర్వాకం ఇంక చాలు నువ్వు మాట్లాడకు అన్నారు. కోపంగా బాగా చెప్పావు నాన్న అంటూ జ్యోతి వచ్చింది లోపలి నుండి సుమతి మళ్లీ పెళ్లి చేసుకోకూడదా అంది! తల్లితో ఏంటి నువ్వు కూడా ఇలా మాట్లాడతావు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని పంతులుగారిని పిలిపించాను మీరిలా మాట్లాడతారేంటి అంది కోపంగా నాకు ఇప్పుడే ఏం ఎత్తి పోలేదు.ముందు సుమతికి చెయ్యాలి అంది జ్యోతి?

పంతులుగారు మా సుమతికి ఏమైనా మంచి సంబంధాలు ఉన్నాయా చెప్పండి! అన్నీ ముందే వివరంగా చెప్పండి! తర్వాత అనుకుంటే బాగుండదు ఆ అమ్మాయికి ఏంటండీ లక్షణంగా ఉంది ఎందుకు చూడను భేషుగ్గా చూస్తాను.అన్నారు పంతులుగారు.
ఈ ఇద్దరికీ చూస్తాను ఎవ్వరికీ వీలైతే వాళ్లకు చూద్దాం! మంచి సంబంధం తీసుకుని త్వరలో వస్తానని వెళ్లారు. పంతులుగారు.

సుమతి అంటూ లోపలికొచ్చింది జ్యోతి చెప్పవే అంది
నాన్న నీకు సంబంధం చూస్తున్నారు. నాకా? అంది ఒక్కసారిగా ?అంది! అవును నీకే ఏంటి చేసుకోవా నాకు ఇప్పుడు పెళ్లేంటి అంది ఆశ్చర్యంగా అలాగే వుండిపోతావా గతాన్ని తలుచుకుంటూ, అంది.
నాకు చేసుకోవాలని లేదు జ్యోతి ఏ ఎందుకని అదే నాకు మండుద్ది మరి ఇంకా నాకేం చెప్పకు నీవు పెళ్లి చేసుకోవాల్సిందే ! చేసుకుంటున్నావ్ అంతెే అంటూ వెళ్లింది.

జ్యోతి అంటూ అరుచుకుంటూ వచ్చింది తల్లి ఎందుకలా అరుస్తావ్ ఇక్కడే ఉన్నానుగా? మెల్లిగా అని చెప్పొచ్చు కదా? ఏంటి మీరిద్దరూ అలా మాట్లాడుతున్నారు నా మాటంటే లెక్కలేదా నీ పెళ్లి చేయాలని నేను అనుకుంటే మధ్యలో ఈ లిటికేషన్ ఏంటి నా కంటే పెద్దది సుమతి దానికి పెళ్లికాకుండానే నేనేలా చేసుకుంటాను.సుమతి నా అత్తయ్య కూతురు
ఒకేచోట కలిసి మెలిసి పెరిగాం అక్కాచెల్లెళ్లలాగా ఉన్నాం అది కష్టపడుతుంటే నేను చూస్తూ ఏలా వుంటాననుకుంటున్నావు?అంది.ఏమీ మాట్లాడకుండా కోపంగా వెళ్లింది.

శాంతమ్మ గారు అంటూ మళ్లీ వచ్చారు పంతులుగారు.
పరంధామయ్యగారు ఎదురుగానే ఉన్నారు.ఆ రండి పంతులుగారు. కూర్చోండి.అన్నారు. మీ సుమతిని చూసుకోడానికి రేపు వస్తున్నారండీ అంటూ తియ్యని కబురు చెప్పారు.చాలా సంతోషం పంతులుగారు.
అమ్మ సుమతి ఇలా రామ్మా అన్నారు.మామయ్య
అలాగే పంతులుగా రొచ్చారు కాఫీ పట్రా అమ్మ అలాగే అంటూ కాఫీ తెచ్చి ఇచ్చింది.రేపు నిన్ను చూడడానికి పెళ్ళి వారు వస్తున్నారు. తల్లి అన్నారు.మీ ఇష్టం మామయ్యా అంటూ లోనికి వెళ్ళింది.

ఉదయానికల్లా పెళ్లివారు వచ్చారు.పంతులుగారు ఆ విషయం చెప్పారా అని మళ్లీ అడిగారు.మీరేం కంగారుపడకండి అన్నీ వివరంగా చెప్పాను.అమ్మయ్య అనుకున్నారు. మనసులో” పిల్లాడి తల్లిదండ్రులు తమ్ముడు అక్కయ్య అందరూ వచ్చారు.కాఫీ టిఫెన్లు ఇచ్చారు.అమ్మాయిని చూసి ముచ్చటపడి చాలా బాగుంది. అమ్మాయి మాకు నచ్చింది అన్నారు.

కాఫీ టిఫిన్లు జ్యోతి అందరికీ అందించింది.అబ్బాయి తమ్ముడు జ్యోతిని చూసి మెల్లిగా తల్లి చెవిలో నేను జ్యోతిని చేసుకుంటానని చెప్పాడు అలాగే లేరా అంటూ, నవ్వింది.ఏమండీ అన్నయ్య గారూ మీ అమ్మాయి జ్యోతిని మా రెండో అబ్బాయి ఇష్టపడ్డాడు మీకిష్టమైతే మీ ఇద్దరి పిల్లల్ని మా ఇద్దరబ్బాయిలు చేసుకుంటారు. మీ కిష్టమైతే తాంబూలాలు పుచ్చుకుందాం ఏమంటారు అన్నయ్యగారు అంది ఇంకేమంటారు తియ్యని కబురు చెప్పాక అన్నారు. పంతులుగారు. సరే లెండి పిల్లలకు ఇష్టం అయితే మన దేముందండీ అన్నారు.

ఒక శుభముహూర్తాన ఇద్దరి పెళ్లిళ్లు రంగరంగ వైభవంగా జరిగింది.ఇక్కడ మేనత్త మేనమామ పిల్లలుగా కలిసిమెలిసి తిరిగిన పిల్లలు అక్కడ తోడికోడళ్లుగా వెళ్లారు. ఇంక వీరి ఆనందానికి అవధుల్లేవు అక్కడ కూడా ఎంచక్కాగా కలిసిమెలిసి ఉండొచ్చు కదా అనుకున్నారు.శాంతమ్మ కూడా మారు మాట్లాడలేదు. అందరికీ ఇష్టం అయ్యాక తను చేసేది ఏముందని మనసు కుదుట పరుచుకుంది.
ఇద్దరూ చక్కగా అత్తారింటికి వెళ్లారు.వీరి బంధం చాలా గట్టిది.ఎన్ని జన్మల చేసుకున్న అదృష్టమో కదా అనుకున్నారు ఇద్దరు.జ్యోతి తల్లికి నాన్నను మంచిగా చూసుకొమ్మని చెప్పింది మేం మధ్యమధ్యలో వస్తుంటామ్ నీకు ఎందుకు కోపం చెప్పు అపశకునము అంటూ ఏమీ ఉండదు.మన మంచి మనసుంటే చాలు ఈ అపశకునాలు మనకు అడ్డురావు తన కోపమే తన శత్రువు అమ్మా నీవు మంచిగా ఉంటే మేము కూడా మాధ్య మధ్యలో వస్తూ పోతుంటాం నీవేమీ బాధపడకు అంటూ అప్పగింతలు చెప్పి వెళ్లారు.సరే తల్లి మీరు బాగుంటే నాకంతే చాలు అంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!