జీవితమే ప్రశ్నార్థకం!

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)

జీవితమే ప్రశ్నార్థకం!

రచన: సుజాత.పి.వి ఎల్

మనసు ముక్కలైనప్పుడు
అంతరంగంలోంచి
అనంత ధ్వనులు ప్రతిధ్వనిస్తాయి..
జ్ఞాపకాలు ఒక్కొకటి తెగి
ఛిద్రమైన హృదిని వెక్కిరిస్తాయి..
దిన దిన గండంలా సాగే జీవన యానంలో
ఆశలు, ఆశయాలకు తావెక్కడ?
వాస్తవానికి కష్టాలుంటేనేగా సుఖం విలువ తెలుస్తుందని సరిపెట్టుకుందామనుకున్నా..
కష్టమే జీవితమై
కడగండ్ల కాలానికి చరమగీతం ఎప్పుడని..
అంతరంగం ప్రశ్నిస్తే..
ఆ జీవితం ప్రశ్నార్థకం!
చుట్టూ వేనవేల మనుషులున్నా
దుఖఃమొచ్చినప్పుడు నేనున్నాననీ ధైర్యాన్నిచ్చే
‘నా’ అన్న హస్తం కరువైనప్పుడు బ్రతుకే వ్యర్థం..
నిజానికి ఒంటరితనం హార్టెటాక్ కంటే భయంకరమైనది..
పగిలిన గుండెకి ఊరడింపులతో
ఎన్నిసార్లు శస్త్ర చికిత్సలు చేస్తే మాత్రం
ఫలితం శూన్యం!
**

You May Also Like

One thought on “జీవితమే ప్రశ్నార్థకం!

  1. నిజానికి ఒంటరితనం హార్ట్ ఎటాక్ కంటే భయంకరమైనది….సూపర్ గా ఉంది మేడం… ఒక మంచి కవిత…. అభినందనలు మేడం👌👌👌💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!