అతివ అంతరంగం

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)

అతివ అంతరంగం

రచన: ఐశ్వర్యరెడ్డి గంట

హృదయ తరంగాన రేగిన జ్వాలలకు
నా మనస్సు ఉప్పెన అవుతుంటే
నీ స్వేచ్చ మాటేమిటి అని
నా అంతరంగం నన్ను ప్రశ్నిస్తుంది

కన్నుల నుండి జారిన ప్రతి
కన్నీటిచుక్కకు సమాధానం కావాలంటూ
నా అంతరంగం నన్ను ప్రశ్నిస్తుంది

నువ్వు బ్రతుకుతున్న బ్రతుకులో
నీ బ్రతుకు ఏది అంటూ
నా అంతరంగం నన్ను ప్రశ్నిస్తుంది

నా కోరికలు ఆశలు తీరే దారి లేక కొట్టుమిట్టాడుతుంటే నిజాన్ని మార్చమంటూ
నా అంతరంగం నన్ను ప్రశ్నిస్తుంది

శిశిరం వాటేసిన రాలిపోనీ ఆకుమల్లే
సజీవం కానీ అజ్ఞాతంలో ఉన్న వేళ
నీ మనస్సు మాటవినవెందుకని
నా అంతరంగం నన్ను ప్రశ్నిస్తుంది.

నా అంతరంగమున ఉన్న నా అంతర్ముఖమా
బాధ్యతలకు బంధినై ,బంధానికి బానిసనై
నీ ఎదుట నిలవలేక, జవాబు లేక
చెదరని చిరు నవ్వుతో తప్పుకుంటున్న.

అయిన నాలోని భావాలకు ఊతం ఇచ్చి
నన్ను నన్ను గా ప్రేమించే ప్రేమికుడు నువ్వే
నా ప్రియమైన శత్రువు నువ్వే
నన్ను వదిలిపోని ప్రాణం నువ్వే.

You May Also Like

2 thoughts on “అతివ అంతరంగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!