సహస్ర కవిమిత్ర త్రిపుర సంగమం

సహస్ర కవిమిత్ర త్రిపుర సంగమం
(పుస్తక సమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సమీక్షకులు: నారుమంచి వాణి ప్రభాకరి

పుస్తకం పేరు: సహస్ర కవిమిత్ర త్రిపుర సంగమం
రచన:
చర్ల విదుల కుమారి
చర్ల మృదుల కుమారి
నారుమంచి వాణి ప్రభాకరి

కవి మిత్ర త్రిపుర సంగమము. కవితా నవరత్నము, అధునిక మహిళా కవిత్రయం గా పేరు పొందినారు. తెలుగు కవితా వైభవం నుండీ కవి మిత్ర త్రిపుర సంగమంగా రుపు దిద్దుకుంది. ముగ్గురు కవయిత్రులు, కవి మిత్ర బిరుదు పొందారు.
డాక్టర్ విధుల 100,
డాక్టర్ మృదుల 100
వీణ రవళి 100 కవితలు రాసి ఈ బిరుదు పొందారు.
వాణి ప్రభకరి మరో సారి 500 కవితలు రాసి కవి రత్న బిరుదు పొందారు. ముఖ్యం గా ఇందులో ముందు మాట డాక్టర్ పుర్ణవంధ్ గారు ప్రపంచ మహాసభల కార్యదర్శి, గుత్తి కొండ సుబ్బారావు గారు ప్రపంచ సభల అధ్యక్షులు ముందు మాట రాశారు, శ్రీ మేక రవీంద్ర గారు ముందు మాట రాశారు. ముఖ్యం గా ఇందులో కవితలు అన్ని రకాలు ఉన్నాయి. వాట్స్ ప్, ఫేస్ బుక్, నేటి స్వచ్ఛ భారత్, సమాజ పరిస్తితి, వంటకాలు, కూరలు పళ్ళు నిజజీవిత సత్యాలు అన్నింటినీ ఉదహరిస్తూ అద్భుతంగా రాశారు. కవితకు కాదేది అనర్హం అన్నట్లు గా విరి కవిత ఝరి ఉన్నది. సమాజ వ్యక్తుల స్వభావాల ననుసరించి మంచి మానవత్వం ఈ ముగ్గురు సమాజ సేవ కళా సేవలో కృతకృత్యులు అయి ఎందరికో ఆదేశం, ఆదర్శం కూడా, ఈ పుస్తకము వారు సాహితీ వేత్తలకు అమూల్యం గా అందించారు. శ్రీ గబ్బిట దుర్గ ప్రసాద్ ఉయ్యూరు సరస భారతి నిర్వాహకులు చేతి మీదుగా దీని ఆవిష్కరణ 1-2-2021 న మల్లవరం గాంధీ ఆశ్రమం లో నిర్వహించారు. ఎందరో సాహితీ వేత్తల మన్ననలు అందుకున్నారు. భీమవరం లో 6,7,8 తరిఖులు భీమవరం లో జరిగిన తెలుగు సారస్వత పరిష్త్ కార్యక్రమం లో కూడా అమూల్యం గా ఇవ్వ బడింది. వాళ్ళ పెర్లకి తగ్గట్టుగా. ముగ్గురు ఉప శీర్షికలతో ప్రత్యేక పుస్తక విభాగ పేరుతో వాళ్ళ వృత్తి నీ, ప్రవృత్తి నీ తెలిపే పద్దతిలో ఈ పుస్తకం పేరును పెట్టారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!