సిసింద్రీలు (02-03-2022)

తేది: 02-03-2022

సిసింద్రీలు 
(ప్రక్రియ రూపకర్త: కార్తిక్ నిమ్మగడ్డ)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

 

ఓ ప్రేమ..
మృత్యువు ఒడిలో చేయి వదిలి నవ్వుకున్నది ఒకటి..!
మనసుతో ముడేసి ఒడిలో దాచుకుంది మరొకటి..!!

-కార్తిక్ నిమ్మగడ్డ

********************

ఓ బంధం
చేసిన గాయం నా ఊపిరి ఆగేలా..
చేసిన మోసం నే మళ్ళీ మౌనం అయ్యేలా..!!

– బుజ్జమ్మ

********************

ఓ అడుగు
నిను చూసిన క్షణంలో నిలిచింది
నీవే జీవితం కావాలని ఆశించింది..

-ఉమామహేశ్వరి యాళ్ల

********************

ఓ పుట్టుక
మనిషి అండమే మారు పిండమై…
మారే ప్రేమలు పంచు బంధమై…

-దరిసిపూడి వెంకట మానస

********************

ఓ జ్ఞానపకం
గగనపు వీధిలో విహారం..
గతించిన కాలపు అనుభవం

-మాధురి మేక

********************
ఓ పాప
ముద్దులు మూటగట్టు చిన్నారి పసి పాప
ముంగిట నడయాడు అందాల చిన్ని పాప

– శ్రీమతి నందగిరి రామశేషు

********************

ఓ నయనం
సర్వేన్ద్రియాల్లో ఒకటై..
ఆ వరుసలో ప్రదానమై!!

– జె .భీమారావు

********************

ఓ తాతయ్య
రోగాలతో వణిికేటి తాతయ్య కూడా
రోమియగా కులికేను అమ్మాయినిచూడ…

– శ్రీ ధూర్జటి

********************

ఓ వేదన
గతం వెంటాడుతూ వేధిస్తోంది
గడచిన క్షణాలు కన్నీటిని తెప్పిస్తోంది

-మహేంద్ర కుమార్

********************

ఓ నిట్టూర్పు
ఆశల కడలిలో అలలు ఎగసిపడుతున్నాయి
ఆవల తీరాన్ని చేరలేని ఆంక్షలను నెట్టేస్తున్నాయి

-సుజాత.పి.వి.ఎల్.

********************

ఓ మనిషి
మానవత్వం జీవితంలో అలవర్చుకోవాలి
మనిషిగా కొన్ని జీవితాలలో నైనా వెలుగులు నింపాలి

-యిడుకుల్ల గాయత్రి

********************

ఓ సిసింద్రీ
మనోహర రచయితలు చేస్తున్న అక్షర సేద్యం
మనసుదోచే కవితలకు పోస్తుంది ప్రాణం

-మంజీత కుమార్

********************

ఓ.. మనిషీ
మారిపోకు అబలల పాలిటి మృగాడిలా
మసులుకో మానవత్వమున్న మనిషిలా

-లగిశెట్టి ప్రభాకర్

********************

ఓ పలకరింపు
ప్రతి హృదిని హత్తుకునేలా….
పువ్వులా మకరందపు మాధుర్యం వెదజల్లేలా….

-కొత్త ప్రియాంక (భానుప్రియ)

********************

ఓ ఆశ
ఆశలు అలలై లక్ష్యం వైపుకి పరుగులు తీస్తాయి
ఆశలు దక్షతలై గమ్యానికి దారులు వేస్తాయి..

-పద్మావతి పి
********************

ఓ వర్షం
మది పరవశమై కురుస్తుంది
మది గదిలో మురుస్తుంది.

– ఆకుమళ్ల కృష్ణదాస్

********************

ఓ సిరాచుక్క…!
వస్త్రం పై పడితే అది ఓ మరక…!
వాడియైన కవి కలం లో పడితే అన్యాయానికది చురక….!!

– నాగ రమేష్ మట్టపర్తి

********************

ఓ అమ్మ
నవ మాసాలు మోసిమరి బిడ్డను కంటుంది
న లు దిశలా నీడ గా తోడుగా నిలబడు తుంది

– ఆచార్య గిడ్డి వెంకట రమణ

********************

ఓ గాయం
నా హృదయాన్ని చీల్చిన నీ మాటల తుటాలు
నా జీవితంలో నీ పరిచయపు ఆనవాలు.

ఓ జ్ఞాపకం
మొదటిసారి మనసుని తడిమిన నీ పిలుపు
మొదటిసారి హృదయాన్ని తాకిన నీ తలపు.

-శ్రీలత.కె

********************

ఓ మథనం
నీ కోసం తపన పడే నా మది కోసమా..
నీ మది నా మది తో చేసే ప్రణయాలాపన కోసమా..

-జయ

********************

ఓ మాట
ప్రేమతో పలకరిస్తే బంధాన్ని పెంచేది
పగతో చీదరిస్తే బంధాన్ని తుంచేది

– చింతా రాంబాబు

********************

ఓ వేదన
మనిషి ఉన్నంత వరకు గుండెలో మిగిలేది,
ఎంత చెప్పుకున్నా కూడా చెరగని
ఙ్ఞాపకమిది

-పి. వి. యన్. కృష్ణవేణి

********************

ఓ భావం
కవి కృష్ణశాస్త్రిలా కడు కమనీయం
కవి సిరివెన్నెలలా బహు రమణీయం

-విఠల్ కాటేకర్

********************

You May Also Like

One thought on “సిసింద్రీలు (02-03-2022)

  1. కార్తీక్ నిమ్మగడ్డ గారు రూపొందించిన సిసింద్రీలు బాగున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!