సిసింద్రీ(లఘు ప్రక్రియ)
(ప్రక్రియ రూపకర్త: కార్తిక్ నిమ్మగడ్డ)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
నియమాలు:
1. ఒక శీర్షిక: ‘ఓ’ అనే అక్షరాన్ని ‘ఏదైనా పదం’తో జోడించి శీర్షిక మొదలై ఉండాలి.
2. రెండు పాదాలు: ప్రతి వరుసలో మొదటి అక్షరం ఒకటే అయ్యి ఉండాలి
(ఆ అక్షర గుణింతంలో ఏదైనా అక్షరం ఉండవచ్చు.)
3. రెండు పాదాలకు అంత్యప్రాస ఉండాలి.
4. శీర్షిక కాకుండా రెండు పాదాల నిడివి 40 లేదా 40 అక్షరాల లోపు ఉండవలెను.
ఉదాహరణ:
1. ఓ బంధం
చేసిన గాయం నా ఊపిరి ఆగేలా..
చేసిన మోసం నే మళ్ళీ మౌనం అయ్యేలా..!!
2. ఓ లేఖ…
చేరేలా నా వద్దకు నువు పంపే చిరుముద్దులు..
చెరిగేలా ఆసాంతం సుదూరాల సరిహద్దులు !!
****************************************
తపస్వి మనోహరం వ్యవస్థాపకులు కార్తిక్ నిమ్మగడ్డ గారు రూపొందించిన సిసింద్రీ ప్రక్రియలో రచనలు ఇవ్వాలి అనుకున్నవారు.. సిసింద్రీ వాట్సప్ గ్రూప్ లో క్రింది లింక్ ద్వారా జాయిన్ కావచ్చు.
https://chat.whatsapp.com/LTLVEzMFCz5HXhWqUtKt6L
– గ్రూప్ సభ్యులు..సోమవారం నుండి శనివారం వరకు ప్రతి రోజూ (9 am- 9 pm) ఒక సిసింద్రీ రాసి, హామీ పత్రం జత చేసి గ్రూప్ లో పోస్ట్ చేయవలసి ఉంటుంది.
– వచ్చిన సిసింద్రీలలో కొన్ని తపస్వి మనోహరం వార, మాస పత్రికలకు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది.
– మిగిలిన సిసింద్రీలు తపస్వి మనోహరం వెబ్సైట్ లో పోస్ట్ చేసి ఆ లింక్స్ ఆదివారం రోజున ఈ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది.
సంప్రదించవలసిన చిరునామా::
ఫోన్ నంబర్:: +91 7893467516
మెయిల్ ఐడి:: manoharam.editor@gmail.com
తపస్వి మనోహరం వెబ్సైట్:: https://thapasvimanoharam.com/
– తపస్వి మనోహరం టీమ్ ✍️