సిసింద్రీలు (03-03-2022)

(03-03-2022)

సిసింద్రీలు 
(ప్రక్రియ రూపకర్త: కార్తిక్ నిమ్మగడ్డ)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

 

ఓ ఉదయం…
రేయి ముసుగులో మిగిలిపోయిన నిన్నటి కలల కోసం..
రేపటి ఆశల భవిష్యత్తు పునాది కోసం..

-కార్తిక్ నిమ్మగడ్డ

********************

ఓ కారణం
అన్వేషిస్తుంది మనసు.. తన దరి చేరేందుకు
ఆరాటపడుతుంది మరో మనసు.. తనలోనే ఉండి పోయేందుకు..!!

– బుజ్జమ్మ

********************

ఓ ఉదయం..
కొత్త ఉదయానికి స్వాగతం పలికేది..
కొత్త ఆశలను, కొత్త ఆలోచనలను కల్పించేది..

-పరిమళ కళ్యాణ్

********************

ఓ విన్నపం..
నా మనసు తపన తెలుసుకో..
నా జతగా నువ్వు సాగిపో..

-మాధురి మేక

********************

ఓ.. మహిళా
కామాంధుల పాలిట సింహస్వప్నంగా మారిపో
కాదు అబల, సబల అని నిరూపించుకో

-లగిశెట్టి ప్రభాకర్

********************

ఓ నవ్వు
నవ్వుతూ,నవ్విస్తూ ఉంటేనే అందం
నవ్వుల పాలు కాకుంటే నే ఆనందం

-ఆచార్య గిడ్డి వెంకట రమణ

********************

ఓ ఉదయం…
ప్లేట్ ఉప్మా ఆహ్వానం పలికింది జీడిపప్పుతో
ప్లేట్లో పెసరట్టు లేక బాధతో లాగించా జీడిపప్పుతో

-రాధ ఓడూరి

********************

ఓ కష్టం
నీలోని బలాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది
నీకు తెలియని నీ బలహీనతను నీకు తెలియజేస్తుంది

-క్రాంతి కుమార్

********************

ఓ అభినందన
అందరి నోట బహు చక్కని మాట…
అద్భుతాల నెలవై మనసున ఆడే సయ్యాట…!

-డి.వి.మానస

********************

ఓ బాధ
కన్నీటి రూపాన స్రవిస్తుంది
కలతతో మదిని కలచివేస్తుంది

-శ్రీమతి నందగిరి రామశేషు

********************

ఓ కవి
కవితలతో కదలికలు కల్పించేవాడు
కలలను సాకారం చేసుకొనేవాడు.

-దోసపాటి వెంకటరామచంద్రరావు

********************

ఓ దీపం
అజ్ఞానఅందకారాన్ని వెళ్లగొట్టెల..
అపురూపజ్ఞానదీపమై వెలుగునిచ్చెల…

-జె .భీమారావు

********************

ఓ పువ్వు
విరిసి పరిమళాలతో నవ్వుతుంది
విరిస్తే భాధ తో ముడుచుకుంటుంది

-చింతా రాంబాబు

********************

ఓ నిరీక్షణ
ఎదురు చూపుల ఎడద
ఎదల మాటున పరదా

-సుజాత.పి.వి.ఎల్.

********************

ఓ ఆమని
పచ్చని చీరకట్టి పులకరిస్తుంది
పచ్చని చిలుకై అందరినీ పలుక రిస్తుంది.

– ఆకుమళ్ల కృష్ణదాస్

********************

ఓ నవ్వు
ప్రేమికుని మదిలోన ఎన్నోఆశలను రేపింది.
ప్రపంచానికి ఎంతో పెద్ద ప్రశ్నగా మిగిలింది.

-రాళ్ళపల్లి నాగమణి.

********************

ఓ ప్రక్రియ
కవి కమనీయ భావాలకు రూపమిచ్చేలా
కవులతో అక్షర సేద్యం చేయించేలా

-నాగ మయూరి
********************

ఓ ఊహ
కల నిజమని కాలాన్ని వృధా చేయకు
కాలంతో పోరాడలేక జీవితాన్ని వృధా చెయ్యకు

– సుజాత కోకిల
********************

ఓ ఆశ
నీ శ్వాస లో శ్వాసనవ్వాలని
నీ అడుగుల గమ్యం నేనవ్వాలని..
-అఖిల

****************************************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!