(తేది: 04-03-2022)
సిసింద్రీలు
(ప్రక్రియ రూపకర్త: కార్తిక్ నిమ్మగడ్డ)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
ఓ స్పర్శ..
నా పెదవులు దాటని పదాలు నీ మేను తాకేలా..
నా మనసు వీడని మౌనం నీ మనసుని చేరేలా..
-కార్తిక్ నిమ్మగడ్డ
****************
ఓ మౌనం..
నాడు.. ఏకాంతంగా నీ ఊసులలో..!
నేడు.. నీ జ్ఞాపకాల కన్నీళ్ళ తోడులో..!!
– బుజ్జమ్మ
*************************
ఓ వేదాంతం
జరిగినదంతా వెనుక జన్మ పరిహారం
జరుగబోయేదంతా మరుజన్మ క్రియకై సహకారం..
-విజయ మలవతు
*************************
ఓ సమాధానం
మనస్సు భారం మాయమయ్యేలా…
మమతల ఒడి చేరేలా..
-జయ
*************************
ఓ ఉదయము..
ఎర్రటి సూర్యుడు తొంగి చూసాడు
ఎదలో సరికొత్త రాగం ఆలపించాడు
-మాధురి మేక
*************************
ఓ మనిషి
స్థాయికి తగ్గ ఎత్తుకు కట్టిన మేడ
సాయంలో కనిపించదే మానవత్వపు జాడ
-మహేంద్ర కుమార్
*************************
ఓ.. అమ్మ
అమ్మ నీ ప్రేమ ముందు ఏది సరితూగదమ్మ
అమ్మ నిన్ను పొగడ అక్షరాలు సరిపోవమ్మ
-లగిశెట్టి ప్రభాకర్
*************************
ఓ స్పర్శ..
మదిలో బాధని హరించేది…
మనసుకు తృప్తిని ఇచ్చేది…
-పరిమళ కళ్యాణ్
*************************
ఓ బాల్యం
నిర్మల మైన మనస్సు కు నిదర్శనం
నిష్కలంక జీవితానికి దర్పణం
-ఆచార్య గిడ్డి వెంకట రమణ
*************************
ఓప్రేమ….
గుప్పెడంత హృదయాన్ని జ్ఞాపకాలతో నింపుటకై…
గుండె గుడిలో ఆరాధనా జ్యోతులు వెలిగించుటకై.
-వలిపే సత్యనీలిమ
*************************
ఓ పుస్తకం
నీలో మాలిన్యాన్ని మటుమాయం చేసేది
నిన్ను మేలిమి వజ్రంలా మలిచేది
-కాటేగారు పాండురంగ విఠల్
*************************
ఓ అబ్బాయి
ముందు కూర్చొని తర్వాత పడుకోరా అబ్బాయి…
మూర్ఖంగా ఒకేసారి పడుకున్నావా… నడుము విరిగేనోయి
-శ్రీ ధూర్జటి
*************************
ఓ తలపు..
తుషార బిందువుల నులివెచ్చని స్పర్శలా
తొలి సూర్యకిరణంలోని చిలిపి పులకింతలా .
-శ్రీలత.కె
*************************
ఓ సమరం…
చెలి సొగసుల సరాగం…
చెలికాని మగసిరి ప్రతాపం…
-ఆర్కా
*************************
ఓ ఆశ
నీ ప్రతీ అడుగులో తోడుగా నిలవాలనీ..
నీకై అనుక్షణం బ్రతకాలనీ….
-విస్సాప్రగడ పద్మావతి
*************************
ఓ కలం
మనసులో భావాలు స్వేచ్ఛగా బయటపెట్టేది
మందలించి మార్గదర్శసై మార్గం చూపేది
-చింతా రాంబాబు
*************************
ఓ చిన్నారి
కల్మషాలు లేని చిరునవ్వుల భాండాగారం..
కురిపించు వెలకట్టలేని ముద్దుల మమకారం..!
-డి.వి.మానస
*************************
ఓ అన్న
నాన్నలా భుజం తట్టి నడిపిస్తాడు
నా అన్నవాళ్ల కోసం నిలబడతాడు
-తమ్మినేని అన్నాజీరావు
*************************
ఓ వేకువ
అనుదిన తేజోమయ సుప్రభాతం
అనంత ఆనందోత్సాహ వికాసం
-సుజాత.పి.వి.ఎల్.
*************************
ఓ మనసు
ఆత్మీయ అనుబంధాలకు సాకారం
అరమరికలు లేని అనురాగాల మమకారం..
-పద్మావతి పి
*************************
ఓ స్నేహం…
చిగురించినది నా పూదోటలో…
చిరకాల బంధమై నా జీవితంలో..
-రాధ ఓడూరి
*************************
ఓ అంతరంగం
అంతరంగం అవగతం కాదు
అవగతమైతే మనసు నిలువలేదు
-యిడుకుల్ల గాయత్రి
*************************
ఓ మానవుడా
మతంకాదు మానవత్వమే ముఖ్యమని
మనమంతా ఒకే కుటుంబమని..
-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
*************************
ఓ పసిపాప
కిలకిల నవ్వులతో మురిపిస్తుంది
కలతలన్నీ తన నవ్వులతో మరిపిస్తుంది.
-శిరీష వూటూరి
*************************
ఓ సంకల్పం
మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది…
మనలోని దక్షత నైపుణ్యాలకు పదును పెడుతుంది…
-కొత్త ప్రియాంక (భానుప్రియ)
*************************
ఓ అమ్మ
పిల్లలందరికీ దీవెన వెన్నెల కురిపిస్తూ
పిల్ల తెమ్మెరలా అందరినీ మురిపిస్తూ
-ఆకుమళ్ల కృష్ణదాస్
*************************
ఓ కూతురు
కాదు తాను ఎన్నటికీ బరువు
కాపాడుతుంది ఇరు వంశాల పరువు
– నాగ రమేష్ మట్టపర్తి
*************************
ఓ కూతురు
నా కూతురితో నేను అప్పుడు ఆకాశంలో సగమనిపించాను
నా కూతురిని ఇప్పుడుఆకాశమంత అనిపించాను.
-లక్ష్మీ శైలజ
*************************
ఓ కవనం
మదిలో జరిగిన మేధోమధనపు రూపమిది
మెదడులోని ఆలోచనలకి అక్షర తోరణమిది
-ఉమామహేశ్వరి యాళ్ళ
*************************
ఓ నీటిధార
నిన్ను కాపాడే ప్రాణధార…
నీకు చల్లటి జీవితాన్నిచ్చే ఈ నీటిధార.!
-జె .భీమారావు
*************************
ఓ ఆనందం
పచ్చ పచ్చని పైరులు
పడుచు పిల్ల మెచ్చిన అందాలు
-సుజాత. కోకిల
*************************
ఓ గాయం
మనసును తొలచివేస్తూ కృంగిస్తుంది
మాయనిమచ్చగా జన్మజన్మలకు మిగిలిపోతుంది.
-దోసపాటి వేంకటరామచంద్రరావు
*************************
ఓ ఓదార్పు
మనసు భాధ ను దూరం చేసే ఓ మాట
మన మది స్వాంతన పొందే ఓ బాట
ఓ వెన్నెలా
పైర గాలికి పరిమళాన్ని నింపిన పూవులు
పైట కొంగుకు పరువాలను ఒంపిన తావులు
-దొడ్డపనేని శ్రీ విద్య
*************************
ఓ మనీ…
నువ్వు నిత్యం చేసే పనులు మెనీ
నువ్వే లేకుంటే మనిషి బ్రతుకు మినీ…
– మహా
*************************