తీపిజ్ఞాపకం

తీపిజ్ఞాపకం.
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల.

“బాబు సుధీర్ ఇలా రారా! ఏంటమ్మా విసుక్కుంటూ ఏంటో చెప్పు అంటూ అక్కడ నిలబడ్డాడు ఏంటి అలా విసుక్కుంటావు”. ఈ వయసులో మీకు బొత్తిళకు భయం లేదు, పెద్దలంటే గౌరవం లేదు, ఓపిక అసలే లేదు. ఓపిక లేకుంటే ఎలారా పెద్ద వాళ్లు చెప్పగానే రావాలి ఇప్పటి నుండే ఇంత చికాకు విస్కు ఉంటే ఎలా రా  తప్పుకదు మా కాలంలోనా మాకు విస్కు అంటే తెలియదు ఎవరు ఏ పని చెప్పినా చిటికెలో చేసేవాళ్లం పెద్దలంటే
గౌరవంగా మసలుకునే వాళ్ళం. ఏమిటో ఈ కాలం పిల్లలు. ఆహా.. మొదలుపెట్టావా! నీ పురాణం ఆపుతావా! నీ సోది చెప్పు ఏం కావాలి! లోపల చిన్నట్రంకుపెట్టె ఉంది. తే నాయన ఈ పాత ట్రంకు పెట్టెలో ఏముందో చెప్తాను తేరా, మీ నాన్న ఉన్న రోజులలో ఇంటికీ కొంత ఖర్చుకు డబ్బిచ్చేవాడు అందులో ఖర్చులు పోగా మిగిలినవి పోస్టాఫీసులో  పొదుపు చేసేదాన్ని ఆ ట్రంకు పెట్టెలో పోస్టాఫీస్ కాగితాలున్నాయి. ఇప్పుడు దాని కాలపరిమితి అయిపోయింది. కొద్దిగా తెచ్చిపెట్టు అంది. అలాగే అంటూ ట్రంకుపెట్టె తెచ్చి తన ముందుంచాడు. మా కాలంలో మేం ఎన్ని జాగ్రత్తలు పాటించేవాళ్ళం
దుబారా ఖర్చులు పెట్టేవాళ్లం కాదు. ఇప్పుడు మీరు అన్ని దుబారా ఖర్చులు పెడతారు. అసలు మాట వినరు. పొదుపు మనిషికి చాలా అవసరం అంది..”ఆ ట్రంకు పెట్టె తెరిచి చూసింది అందులో తన జ్ఞాపకాలున్నాయి”. అవి చూడగానే కళ్లు  చెమర్చాయి తనకు రాసిన లాస్ట్ ఉత్తరం. తను లేకున్నా తన జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళిపోయాడు.
ప్రియమైన నా ఇంటి ఇల్లాలైన సుందరానికి ప్రేమగా వ్రాయునది ఏమనగా? నేను ఇక్కడ కుశలం నువ్వు పిల్లలు ఎలా ఉన్నారు. పిల్లలు బాగున్నారని అనుకుంటాను. నువ్వు నాకు ఏ లోటు లేకుండా నాకు తోడుగా ఇంతవరకు సహకరిస్తూనే వచ్చావు. నా సహధర్మచారిణిగా? నాకు నాలుగైదు రోజులు పట్టింది నీకు లెటర్ రాయడానికి మనకు ఇంకొక నేలనే ఉంది మనకి ఈ ఎడబాటు “నాకు రిటైర్మెంట్ వచ్చెనెలలో అవుతుందని చెప్పారు. ఎక్కడైతే జాయినింగ్ ఆర్డర్స్ తీసుకున్నామో, అక్కడే రిటైర్మెంట్ పూర్తి అవుతుందని చెప్పారు. నేను త్వరగానే వస్తున్నాను అక్కడే నాకు రిటైర్మెంట్ మనం అక్కడే కలిసి హాయిగా ఉండవచ్చు. త్వరగానే వస్తాను పిల్లలు నువ్వు జాగ్రత్త. ఆ లెటర్ చదివి కళ్ళు తుడుచుకుంది. మా కాలంలో కార్డులలోనే లెటర్సు రాసేవాళ్లం అవి ఎంతో జాగ్రత్తగా చదివి దాచుకునెే వాళ్లo. దాన్ని మలిచి మళ్ళి ట్రంకుపెట్టెలో పెట్టేసింది. హరెే బాబు సుధీర్ అది ఎక్కడైతే ఉందో మళ్లీ అక్కడే పెట్టేసి బాబు అంది. సరే అమ్మా అన్నాడు. అప్పటి నుండి ఇప్పటివరకు ఐదు లక్షలు అయినవి చూశావా. నాయన మేము పొదుపు చేసిన డబ్బులు. పొదుపు లక్షణాలన్నీ నేర్చుకోవాలి నాయన. తన జ్ఞాపకాలను కొడుకుతో చెప్పి. అలా నడుం వాల్చింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!