జవాబులేని ప్రశ్న

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)

జవాబులేని ప్రశ్న

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

ఎన్నెన్నో ఆలోచనలు అంతరంగంలో సుడులు తిరగుతున్నాయి
అంతరంగంలో రగిలే బడబాగ్ని చల్లారుతుందా?
ఎంతో ప్రేమించిన ప్రియురాలు బదులివ్వకపోతే?
అగాధంలాంటి ఈ మనసుకు గాయమైతే
అన్వేషించేవారెవరు?
ఎన్నెన్నో ఎదురుదెబ్బలు తగిలి కఠిన పాషాణమైపోయిందే?
మమతానురాగాలు పెంచుకుంటే ఇలా వంచిస్తారా?
మంచికి సమాధికడతారా?
మానవత్వాన్ని మంటగలుపుతారా?
మనిషి మృగంగా మారిపోతున్నాడెందుకు?
అంతరంగానికి సమాధానం చెప్పకోగలడా?
సమాజమెలా చూస్తూ ఊరుకుంటోంది?
పాశవికత్వం పాలన హర్షించగలమా?
నిర్లక్ష్యధోరణి సహించగలమా?
కులమతాలవిధ్వేషాలు పెచ్చురిల్లుతుంటే
నిస్సహాయులుగా నిలబడిపోతున్నామా?
ఆకలికేకలు ఆత్మహత్యల పర్వాలు కళ్ళుతెరిపింటంలేదెందుకో?
గుడిసెలు కాలిపోతుంటే వీణానాదాలా?
ఊపిరులాగిపోతుంటే సయ్యాటలా?
పల్లెలు పట్టణాలు జలసంద్రాలవుతుంటే
కట్టడిచేయలేరా?
చదువుకున్న వాళ్ళు చవటలుగా మిగిలిపోవడమేనా?
సరిహద్దులలో సైనికుల పహరాకాస్తున్నా శత్రుదేశాల
ఆగడాలను అరికట్టలేమా?
ఇవి అంతరంగ ప్రశ్నలే?
ఇవన్నీ జవాబులేని ప్రశ్నలే?

You May Also Like

One thought on “జవాబులేని ప్రశ్న

  1. బావుంది సర్…. అభినందనలు సర్👌👌👌👌💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!