చివరికి

చివరికి

రచన :యాంబాకం

ఒక ఊరిలో సుబ్బుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన శాస్త్రాలు చదివిన జ్ఞాని.ఆయన వృత్తి పౌరోహిత్యం చేసుకుంటూ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా చేదోడు ,వాదోడు గా ఉండేవారు. అందరూ ఎంతో గౌరవించేవారు, కానీ ఆయన భార్య రంగమ్మ దృష్టి లో ఆయన ఒక సామాన్య పురోహితుడు మాత్రమే.
తన భర్త కన్నా విద్యవివేకాలు తక్కువ వున్నవారు, ఎక్కువ సంపాయించడము, తన భర్త పరోపకారం అంటూ సంపాదన మీద శ్రద్ధ చూపక పోవడం ఆమెకు సబబు కాదనిపించేది. కొంచెం అసంతృప్తి గానే ఉండేది. మాటి మాటికి లౌక్యం గా నడుచుకోమని ఆమె భర్తకు సలహాలు ఇచ్చేది. ఆయన అందుకు ఒప్పుకొనక పదిమందికి కష్టం సుఖంలో పాలు పంచుకొనడమే పెద్ద కలిమి! అని అమెకు నచ్చ చెపుతుండేవాడు. ఆయన కోరిక ప్రకారం ఇరుగు పొరుగు వారికి సాయం చెయ్యడం రంగమ్మకు ససేమిరా ఇష్టం లేక పోయినా భర్త కోసం మౌనంగా ఉండేది.
సుబ్బుశర్మకి ముగ్గురు ఆడపిల్లలు కలిగారు. వాళ్ళ జాతకాలు చూసి వారిజాతకాలకు తగినట్లుగా వారికి లక్ష్మీ, సరస్వతి, పార్వతి అనిపేర్లు పెట్టాడు సుబ్బుశర్మ. వారి పేరుకు తగినట్లు లక్ష్మీది ధనమోగం,‌సరస్వతి చదువుల తో పాటు సంగీతకళలో ఆరి తేరింది పేరు కుతగినట్లుగా పార్వతి పెద్దగా చదువు లేకపోయినా ఎలాంటి పరిస్థితులనైనా‌ తట్టుకుని నిలబడగల నేర్పరితనం నేర్చుకొంది.ఆ అక్కా చెల్లెళ్ళ జీవితాలు సుబ్బుశర్మ అనుకున్నట్టె రూపొందాయి. లక్ష్మీని ఒక సంపన్నుడు పెళ్ళాడాడు. అమె కాపురానికి రాగానే అమె అత్తవారికి కలిసి వచ్చింది.సంపద అంతకంతకు పెరిగింది. సరస్వతి చిన్నతనం నుంచి సంగీతంలో అభిరుచి ఉన్నది. సుబ్బుశర్మ కూడ అమె కు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాడు. ఆ ప్రోత్సాహంతో అమె ఆయాకళలలో అరితేరింది. అమెను కళాభిమానం ఉన్న విద్వాంసుడు పెళ్ళాడాడు. అమె రాకతో వారి ఇల్లు కళా నిలయం అయిపోయింది. దేశంలోని కళాకారులు లెందరో సరస్వతి ఇంటికి చేరి కచేరీలు జరుపుతుండేవారు.
పార్వతికి మాత్రం పెద్ద సంబంధం కుదరలేదు. ఆమెను పెళ్ళాడడానికి ఎవరూ ముందుకు రాలేదు సుబ్బుశర్మ ఎంతో ప్రయత్నం మీద ఒక చిన్న గ్రామంలో ఉండే పురోహితుడి కిచ్చి పెళ్ళి చేశాడు. రంగమ్మకు ఆ సంబంధం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. కాని పార్వతి మాత్రం తన అక్కలకు వచ్చిన గొప్ప సంబంధాల వంటిది తనకు రాలేదని చింతించ లేదు “తెలివిగా బతకడానికి ఐశ్వర్యం అవసరం లేదు”అన్నాదామె. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన కొద్దికాలానికి సుబ్బుశర్మ జబ్బున పడ్డాడు. తనకు ఇంక ఋణం తీరిపొయిందని తెలుసుకుని తన కుమార్తెలకు కబురు చేయించాడు. పెద్ద వాళ్ళిద్దరూ రాలేకపొయారు.కాని పార్వతి మాత్రం తెలియగానే వచ్చింది. పెద్ద కూతుళ్లు రానందుకు ఎంతో దిగులు చెందాడు.
రంగమ్మ మాత్రం వాళ్ళిద్దరిని సమర్దిస్తూ లక్మీ అది రావాలంటే మాటలా! వాళ్ళ ఇంట్లో బరువు బాధ్యతలు, ఇకపోతే పిల్లలు, ఎంతో బరువు భాధ్యతలు మోస్తుందో మీకు ఏమితెలుసు?అంటూ, ఇక సరస్వతి దేశ దేశాల కళాకారులు వస్తుంటారు, పోతుంటారు అదొక కచేరి నిలయం విడిదిలా ఉంటుంది.అది రావాలంటే మాటలా! అని కూతుళ్లు ని సమర్దించింది.
సుబ్బుశర్మ అందుకేమి సమాధానం చెప్పక మౌనంగా ఉండి పోయాడు. రంగమ్మ మనసు ఎరిగిన వాడై నానాటికి ఆయన ఆనారోగ్యం ముదిరింది. ఆలస్యంగానైన పెద్ద కూతుళ్లు కూడ వచ్చారు.లక్మీ వచ్చి రాగానే మంచి వైద్యులను పిలిపించి చూపించినా ప్రయోజనం లేకుండా పోయింది.ఆయనకు ఆరోగ్యం కుదుటపడ లేదు.
ఒకరోజు సుబ్బుశర్మ తన భార్యను దగ్గర పిలిచి “నా కాలం “చివరికి ” వచ్చింది . నా అనంతరం “నువు పార్వతి దగ్గరే ఉండి పొవటం మంచిదని నా సలహా” అన్నాడు రహస్యంగా! భర్త మాటలకు రంగమ్మ కు కొపం వచ్చింది. “మీకు పార్వతి అంటే ఎందు కంత నమ్మకం! అసలు దానికి ఉంటేకదా నాకు పెట్టేది!లక్ష్మీకి అంత ఐశ్వర్యం ఉందికదా, అది నన్ను పోషించ లేదా! లేక అది కఠినాత్మురాలని అను కుంటున్నారా? సరస్వతి ఇంటికి యాత్రికుల్లాగ ఎవరెవరో వచ్చి పొతుంటారు గదా! నేను దానికి భారమవుతానని ఎలా అను కున్నారు? ఇక పార్వతి దాని దారిద్యాన్ని పెంచడానికి నన్ను కూడా వెళ్ళి దాని గొంతు మీద కూర్చోమంటారా! అని భగ్గున లేచింది. ఇంతలో కొంత సేపటికి ఎదోచెప్పబోతు రంగమ్మను కూతుళ్ళకు అప్పగించి కన్ను మూశాడు సుబ్బుశర్మ.
సుబ్బుశర్మ అంత్యక్రియలు యధావిధిగా జరిపించి రంగమ్మ భర్త సలహాను పాటించక, పెద్ద కూతురు లక్ష్మీ వెంట ప్రయాణమయింది. అక్కడ అమెకు అతిథి సత్కారాలు చాలా చక్కగా జరిగాయి. భర్త బతికి ఉన్న రోజుల్లో ఇంటిపని తోబాటు ఇరుగు పొరుగు వారికి చిన్న చిన్న సహాయాలు చేసిపెట్టేపని కూడా ఉండేది. కాని కూతురింట అటువంటి బాధరిబంది ఏమి లేదు,తను కూర్చుని తినడం, నిద్ర పోవడం దిన చర్య గా మారింది. సుఖపడట మంటే ఇదే అనుకొన్నది రంగమ్మ . అయితే ఆసుఖం ఎక్కువ రోజులు సాగలేదు. తల్లి ఏ పని చెయ్యకుండా తిని పడుకో వడం కూర్చొని తినడం లక్ష్మీకి చాలా చిరాకు తెప్పించింది. ఆ ఇంట్లో అందరికి బరువు బాధ్యతలు ఉన్నాయి రంగమ్మ ప్రవర్తన ఎబ్బెట్టుగానే ఉంది అందరికీను.లక్ష్మి అత్తగారు సూటిపోటి మాటలు అన్నప్పటికి రంగమ్మ అంతగా పట్టించుకోలేదు‌.చివరకు లక్ష్మీ అత్తగారు లక్ష్మీతో “నాకు కూడా మీ అమ్మ లాగా తిని, పడుకోని విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది.నేను అమె ఈడుదాన్నే, నాకెందుకు కి ఈవెట్టి చాకిరీ! నా భర్త నా కొడుకులు ఇద్దరూ సంపాయిస్తున్నారు. పెట్టే దానవు నువు ఉన్నావు.మీ అమ్మ లాగే చూసుకో అంది.అమె అన్నంతపని చేసింది.బండెడుచాకిరీ లక్ష్మీ మీద పడింది. తనతల్లి వచ్చే దాక ఎంతచాకిరీ అయినా చేసిన తన అత్తగారు ఏపని చెయ్యకుండా పొవడంచూసి. లక్ష్మీ తన తల్లికి ఇంటి పనులుచెప్పటం,కొన్ని పనులు అమె మీదవదిలెయ్యటము మొదలు పెట్టింది. రంగమ్మ తనకు ఇష్టం లేకున్న పనులు చెయ్యటం తప్పదని ఇక చేసేది లేక ఇంటిపనులు చేయడం మొదలు పెట్టింది. అయితే ఆపనులకు అంతం ఉండేది కాదు. భర్తతో దారిద్ర్యం అనుభవించినప్పుడు కూడ అమె అంత చాకిరీ చేసి ఎరుగదు.ఇలాకొన్నాళ్ళు గడిచాక, రంగమ్మ ఒంటరిగా ఉన్న కూతురితో ఇలా అంది. “ఒకటి అరా పని చేయవచ్చు కాని అతిథిగా వచ్చిన బంధువును అందులో కన్నతల్లి అని కూడ మరచి ఇంటి పనిమనిషిలా చూస్తావా”!అని అడిగింది.
అతిథులు నీలాగా ఎల్లకాలం ఉండిపోతారా? అయినా నీకు ఇక్కడ ఏం తక్కువయింది? నీకు ఇక్కడ బాగా లేదనిపిస్తే? మిగిలిన కూతుళ్లలో ఎవరి దగ్గర కన్న వెళ్ళోచ్చుగా! అన్నది నిక్కచ్చిగా!
ఆ మాటలువిన్న తరువాత రంగమ్మ అక్కడ ఉండాలని పించలేదు. పార్వతి ఇంటికన్న సరస్వతి ఇంటి కన్న పోవాలని నిర్ణయించుకొని, తనకు సుఖంగా ఉండగలదనే అభిప్రాయంతో అమె సరస్వతి ఇంటికి చేరుకొన్నది అమ్మ ని చూసి సరస్వతి చాలా సంతోషపడి అక్కడ గొప్ప గొప్ప కళాకారుల అందరిని అమ్మకు పరిచయం చేసింది. రంగమ్మ లక్ష్మీ ప్రవర్తన గురించిచెప్పేసరికి సరస్వతి ఎంతో నొచ్చుకుని. “నీవు జీవితాంతం ఇక్కడే ఉండు నిన్ను ఎవరూ అడిగేవారు ఉండరు అన్నది.
అయితే రంగమ్మకు పదిరోజుల కే అక్కడ వాతావరణం చూస్తే చాలా రోతపుట్టింది. సరస్వతి ఇంట కాస్త చికాకు,కూతురికి ఒకపద్దతి ,ఒకఆచారమూ లేదు, కులగోత్రాలు తెలియని, నానా రకాల మనుషులు వచ్చి పోతున్నారు అని తనలో తానే మదన పడుతూ ఉండేది రంగమ్మ .అది గమనించి సరస్వతి అమ్మకు ఆచారం, మడి ఉన్నాయి అని ఎరిగి అమ్మ కు తెలియకుండ వంటమనిషిని మాన్పించింది. దాంతో వచ్చే, పోయేవారికి వండటం వడ్డించడం రంగమ్మ మీద పడింది. అమెకు ఆ ఇంటి తిండికూడా వంట పట్ట లేదు. రంగమ్మ కూతురితో “అమ్మాయి మన కుల మేమిటి, ఆచారమేమిటి ,ధర్మసత్రాలలోకూడ ఇలాంటి , పద్ధతులు,జరుగుబాట్లు ఉండవు? కాస్త కటువు గా అన్నది. అమ్మ తత్వం ఎరిగి నదై సరస్వతి
అదేమిటమ్మ! కళలకు కులగోత్రాలతో నిమిత్తం ఏముంది “ఈఇంట కళాకారులకు చోటు ఉంటుంది ఈ ఇల్లు కళాకారుల నిలయం నీ మడి ,నీ ఆచారము ఇక్కడ ఎలా సాగుతాయి? అప్పటికి నీకోసం బంగారం లాంటి వంటమనిషిని తీసేశాను, నీకు ఇంతకన్నా నేను ఏమి చేయగలను? నీఅచారం ప్రకారం జరగాలంటే పార్వతి ఇంటిలోజరుగుతుందేమో! నీకు నా దగ్గర ఉండటం ఇష్టం లేకపోతే అక్కడకి వెళ్ళి చూడు అన్నది. సరస్వతి నిట్టూర్పుగా!
ఇకచేసేదేమిలేక రంగమ్మ పార్వతి ఇంటికి చేరుకుంది పార్వతి తనను సరిగా చూడదని అమె అనుకొన్నది. కానీ పార్వతి అమ్మ రాక చూసి చాలా సంతోషంగా పలకరించు కొంది. వెంటనే రంగమ్మ పార్వతి తో ఇలా చెప్పడం మొదలు పెట్టింది మీ అక్కలిద్దరు ఇలా అలా చూసారు అని, ఇంతలో పార్వతి కలగచేసుకొని అమ్మ తో ఇలా అంది నాన్న ఉన్నప్పుడు నిన్ను కష్ట పెట్ట కుండా చూసుకొన్నాడు. ఇక ఇప్పుడు మాత్రం నీ వెందుకు కష్టపడాలమ్మ “నీవు విశ్రాంతి గాఉండు నీకేం కావాలన్న నేను చేస్తాను” అన్నది. పార్వతి తల్లితో.
తన ఆఖరి కూతురి జీవితం చూసి రంగమ్మ ఆశ్చర్యపడింది.పార్వతి ఐశ్వర్యవంతురాలు కాదు. అయినా పార్వతికి ఏలోటు లేదు. ఇంటి పనులచేయటంతో బాటు పార్వతి ఆ ఊళ్లో ఎవరికైనా ఎదైనా అవసరం వస్తే చేదోడు వాదోడుగా ఉండేది. అందువల్ల పార్వతికి అవసరం కలిగినప్పుడు ఆదుకోవడానికి ఆ ఊరు వారంత సిద్దమయ్యోవారు. పార్వతి మంచితనము, ఆఊరి వారితో లౌక్యం, చూసిన తరువాత రంగమ్మకు భర్త మాటలు గుర్తుకు వచ్చాయి. పార్వతికి డబ్బులు లేక పోయిన పదిమందికి సాయపడాలనే గుణంముంది. ఎదుటి వారి కష్ట పడితే అమె చూడ లేదు. అందుకే పార్వతి బాగా చూచుకోగలదని తనభర్త అనుకొన్నాడని రంగమ్మ గ్రహించింది.సుఖపడడానికి డబ్బు ఒక్కటే చాలదని మంచి సాయంచెసే గుణం పతి ఒక్కరి కి ఉండాలని అమెకు పూర్తిగా అర్ధమైంది.ఆ తర్వాత రంగమ్మ కూడ అ ఊరు వారి
కష్ట సుఖాలు కనుక్కొంటూ ఆ ఊరివారికి తన చేతనైన సాయం చేస్తూ హాయిగా గడిపింది రంగమ్మ.
ఏ కూతురు దగ్గర అయితే తనకు సుఖంగా ఉండదని అనుకొన్నదొ,ఆ కూతురి దగ్గరే హాయిగా రంగమ్మ శేషజీవితం గడిపింది”చివరికి”.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!