నెరవేరని కోరిక

(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)

నెరవేరని కోరిక

రచయిత :: నామని సుజనాదేవి

సకల మానవాళి జీవాన్ని హరించే
ప్లాస్టిక్ అంతమవ్వాలనుకుంటాను

ప్రాణవాయువు ఇచ్చి ప్రాణం నిలిపే
ప్రకృతి పచ్చగా ఉండాలనుకుంటాను

ఆడవారైతే చాలని చేసే అత్యాచారాలు హత్యాచారాలు
పునరావృతం కాక అంతమొందాలనుకుంటాను

అతివలు నిర్భయంగా అర్దరాత్రి అయినా
ఆహ్లాదంగా తిరిగే స్వేచ్చ కావాలనుకుంటాను

కుట్రలు కుతంత్రాలు పదవీ వ్యామోహాలతో
అసూయా ద్వేషాలతో ఉండే నాయకులు వద్దనుకుంటాను.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరాడంబరంగా
నిస్వార్ధ సేవతో నీతినిజాయితీగల నాయకులు కావాలనుకుంటాను

నాకు తెలుసు …అది అందని ద్రాక్ష అని
అలా ఆలోచించడం అంటే
ఆకాశానికి నిచ్చెన వేయడమే నని

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!