(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)
వేయగలనా
రచయిత :: బండి చందు
నా బాల్యం తీరికాలేని తీపి
గాయాలతో గడిచిపోయింది
నా యవ్వనం మోయలేని
బాధ్యతలతో బరువెక్కినది
నా గతం గతకాలపు
జ్ఞాపకాలతో పెనవేసుకున్నది
నా భవిష్యత్తు భారంతో
ఊబిలో కూరుకుపోయినది
నా కలలన్నీ కానరాని
లోయలో జారిపోతున్నాయి
నా ప్రతీ అడుగు గమ్యం తెలియని
దారుల వెంబడి పయనిస్తున్నది
నా మది సంద్రం అలల ఆలోచనలతో
ఉక్కిరిబిక్కిరి అవుతున్నది
నా ఊపిరి ఊగిసలాటలో
ఉరిమే లావా ఉప్పొంగుతున్నది
నా జీవితం ఎండిన చెట్టుకు
రాలిన ఆకులా తెగినది
వీటన్నింటినీ తప్పించుకొనుటకై
వేయాలనున్నది ఆకాశానికి నిచ్చెన…