ఎదురుచూపూలు

ఎదురుచూపూలు

మనసు
మౌనంగా ఉండనంటోంది…!!!

తనువు
నీ కౌగిలిలో బంధీనౌతానంటోంది…!!!

కనులు
జతగాని జాడకై ఎదురుచూస్తున్నాయి…!!!

పాదాలు
అతగాడి వద్దకే పరుగందుకుంటానంటున్నాయి…!!!

ఏ పిలుపు వినబడుతున్నా
నీ పలుకే అని భ్రమించేటి నా కర్ణములు…!!!

అడుగుల చప్పుడైతే చాలు
నీవేననుకునే నా హృదయం…!!!

ఇంటిగడపన కూర్చుని తోవకేసి చూస్తూ
గడిపేసా గడియలెన్నో
నువ్వొచ్చే ఏల కోసం…!!!

నా కళ్లు కాయలు కాసాయి
నా హృదయం ద్రవించింది
నా ఎదురుచూపులు
అడవికాచిన వెన్నెలే అయినాయి…!!!

నీ రాక ఇక గగనమే అయినాది
నీ తనువు ఇంట చేరి
మనసు
మబ్బులలోకంలోని తారకలా మారింది…!!!

 

రచయిత:: కమల’శ్రీ’

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!