జీవన గమనం

జీవన గమనం

రచయిత: సరిత రవిప్రకాశ్

ఈ జీవన గమనంలో అన్ని పాత్రలు ఆ దేవుడు
గీసిన చిత్రాలే అందులో కొన్ని పాత్రలు నవ్విస్తే
కొన్ని పాత్రలు ఏడిపిస్తాయి అలాంటిదే ఈ జీవితం కూడా…

పుట్టగానే
ఏడుస్తాము
పోయేటప్పుడు
ఏడుస్తాము ఇక
నవ్వేదెపుడు.?

రావద్దన్నా వస్తుంది
చావు అయిన మనిషికి
ఆగదు ఏడుపు… నీదైన ఈ దేహం చివరకు నిన్నే విడిచి పోతుంది అయినా
కానీ ఆశ చావదు మనిషికి…

నేను నేను అనేది
నీవనేది మిగలదు
ఎవరికి కాకుండా పోతావు
నేనే నేను అని ఎందుకు మనము అనుకోని ముందుకు సాగాలి
అప్పుడే మన జీవితాలు అడవి గాచిన వెన్నెలగా చేసుకోకు ఓ మనిషి….

సత్యాలను నిరూపించలేక బలైపోతున్నాయి ఎన్నో జీవితాలు,సత్యాన్ని అసత్యంగా చూపిస్తూ,
జీవితాలను గడిపేస్తారు కొందరు ఇదేమి లోకమో ఇదేమి ప్రపంచమో అర్థం కాదు,అర్థం అయ్యేలోపే అంతా ముగిసిపోతుంది..

ఇదే నేటి జీవన పరిస్థితి అందుకే అన్నీ ఎదుర్కొంటూ ముందుకు సాగడమే ఈ జీవన గమనం….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!