విచిత్రబంధం

విచిత్రబంధం

రచన::దోసపాటి వెంకటరామచంద్రరావు

రాము రాధల పెళ్ళై పదిసంవత్సరాలైంది.వాళ్ళకింకా పిల్లలు కలగలేదు.ఎన్నో పూజలు చేశారు.ఎన్నో పుణ్యతీర్ధాలు తిరిగారు.ప్రయోజనం లేకపోగా డబ్బులు ఖర్చైయ్యాయి. ఇక లాభం లేదనుకొని ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు.ఎవరో సలహాకూడా ఇచ్చారు సంతానసాఫల్యకేంద్రాలను సంప్రదించమని. కాని డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని విరమించుకున్నారు. ఇంతే ఈ జన్మకు ప్రాప్తమనుకొని సరిపెట్టుకున్నారు.మాములుగా వారి నిత్యజీవనవిధానంలోకి అలవాటు పడిపోయారు.

రాము రాధలిద్దరు ఒక ప్రైవేటు స్కూలులో టీచర్లగా పనిచేస్తున్నారు.మంచి టీచర్లుగా వారికి పేరుంది. మిగతా టీచర్లందరికి వాళ్లంటే అసూయ ఎక్కువే. కాని తరువాత వారి ప్రవర్తన తెలుసుకొని వాళ్ళతో తమ పద్దతిని మార్చుకున్నారు.వాళ్ళ అన్యొన్నతను చూసి ముట్ట పడేవారు.వాళ్ళకి పిల్లలు లేకపోవడం గురించి తెలిసి జాలిపడేవారు.వాల్లెంతగానో చెప్పి చూశారు తెలిసిన వాళ్ళ పిల్లలెవరినైనా పెంచుకోమని. కాని ఈ రోజుల్లో అందరిది చిన్నకుటుంబాలే కదా. అందరికి ఒకరో లేక ఇద్దరో పిల్లలే.వాళ్లకి ఆ సలహాకూడా లాభించలేదు.ఇక ఆ ఆలోచనే విరమించుకున్నారు.

కరోనా ప్రభావం తగ్గిందని మళ్ళీ విద్యాసంస్థలు తెరవడంతో రాము రాధలు స్కూళ్ళకు బయలుదేరారు.అందరికంటే ముందుగానే స్కూలుకి చేరేవాళ్ళలో వాళ్ళే ముందుటారు.ఆరోజుకూడా
వాళ్ళే చేరారు.వీళ్ళు చేరాకనే ఆయా వచ్చింది భయపడుతూనే.అది ఆమెకు అలవాటైంది.ఆమెకు తరగతి గదులు తుడవమని పురమాయించారు రాము రాధలు.ఈ లోగా టాయిలెట్స్ పరిస్థితి ఎలాగుందోనని చూడడానికి రాధ అటువైపు వెళ్ళింది. పసిపిల్ల ఏడుపు వినిపించింది.ఇక్కడ పసిపిల్ల ఏడుపేమిటని చూస్తే టాయిలెట్ దగ్గర పసిపిల్ల కనిపించింది.చూస్తే అప్పుడే ప్రసవించినట్టుంది.ఎవరో ఇక్కడ వదిలేశారని చుట్టుచూసింది.ఎవరూ కనిపించలేదు.ఆ పిల్లని పట్టుకొని రాము దగ్గరికి వెళ్ళింది.స్కూల్ ప్రిన్సిపాల్గారు మిగతా సిబ్బంది
పోలీసులకు అప్పచెబుతామని పోలీసులకు తెలియజేయమన్నారు.పోలీసులకు సమాచారమందించారు.కాస్సేపటిలో పోలీసులు వచ్చారు.కాని రాము రాధలు ఆ పిల్లని తాము పెంచుకుంటామని తెలిపారు.కాని పోలీసులు కొంచెం అభ్యంతరం తెలిపారు.స్కూలు ప్రన్సిపాల్ మిగతా సిబ్బందికూడా పోలీసులకు రాము రాధలకు పిల్లలు లేరని వాళ్ళు ఆ పిల్లను వాళ్ళకు ఇవ్వమని చెప్పారు.కాని పోలీసులు కొన్నాళ్ళు వేచి చూద్దామని ఎవరైన ఆ పిల్లతాలుకావాళ్ళు వస్తారేమోనని ఆగుదామన్నారు.అయితే ఆ పిల్లను ఎవరు చూస్తారు పోలిసు సేష్టషనులో అని అంతవరకు రామురాధలు చూసుకోమని అప్పచెప్పారు.ఒకవేళ ఎవరైనా మా పిల్లని వస్తే తీసుకు వెళ్తమని అన్నారు.సరేనంటూ రాము రాధలు ఒప్పుకున్నారు.రాము రాధలు ఆ పిల్లను తమ ఇంటికి తీసుకొని వెళ్ళారు.ఒకరోజుకాదు ఎన్నిరోజులైనా ఎవరూ రాలేదు.ఇక ఆ పిల్లను వాళ్ళే పెంచుకోసాగారు.ఆ దేవుడే ఈ విచిత్రబంధాన్ని ఏర్పరచాడని ఆ దేవుడికి వెయ్యిదండాలు పెట్టుకున్నారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!