(అంశం::”చిత్రం భలారే విచిత్రం”)
ఇదేం విచిత్రం
రచన:: సుశీల రమేష్
అరవిరిసిన విరికోసం
అల్లరి తుమ్మెద రాకతో
జంట మనసుల ముద్దులాటలో
ఒక్క ముద్దుతో తనివే తీరదు
అదేం విచిత్రమో.
ముద్దుతో తనివి తీరేది అయితే
ఈ తనువు లకి తాపం ఎందుకు
మరి తాపం తీరేదేనాడు
చెలి నాపై దయ చూపిన నాడు
తుమ్మెద నై దోచెదనని
చెలి లేలేత తేనె సొగసులకై
చెంత చేరి మురిపాలు కురిపించి
ముద్దు చేసి చూడ, అలకపాన్పు
ఎక్కిన నా చెలి చెంతకు రాకు
అంటూ చిరు బురు లాడుట
చిత్రం అయ్యారే భలే విచిత్రం కాదా!
***