ప్రబుధ్ధులు

(అంశం::”చిత్రం భలారే విచిత్రం”)

ప్రబుధ్ధులు

రచన:: సావిత్రి కోవూరు

 కడుపు కట్టుకొని కన్న పిల్లలను అందలం ఎక్కిస్తే,

కన్నవారి కొంపనాక్రమించి, కోట్లకొలది పైకము కొల్లగొట్టి,

కన్నవారిని కడతేర్చు వారెందరో, నడి బజారున వదులు వారసులెందరో చిత్రం భళారే విచిత్రం.

రంగుల లోకాలు రంజుగాను చూపి, కలల రాజ్యంలో గిరికీలు కొట్టించి

రంభా, ఊర్వశివని పబ్బం గడుపుకొని, తేనె పూసిన కత్తుల చందాన

పడుపు వృత్తిలోకి దించు ప్రబుద్ధులు ఎందరో  ౹౹చిత్రం౹౹

నీవే నా ప్రాణంబని, నీవు లేని బ్రతుకు లేదని
బూటకపు ప్రతిజ్ఞలు చేసి,

బురిడీలు కొట్టించి నటనతో నయవంచన చేసి,

ఆడ పిల్లల జీవితాలతో ఆటలాడి, నడి వీధిలోన తలెత్త లేని స్థితికి తెచ్చి ,

ఆత్మహత్యలకు పురిగొల్పే ప్రబుద్దులెందరో
౹౹చిత్రం౹౹

రామరాజ్యము చేసెదనని రాశులుగా వాగ్దానాలు చేసి,

కాసులన్నో వెదజల్లి, మత్తు మందుల ముంచి,

అధికారం రాగానే ముఖము చాటేసే ఏరు దాటి తెప్ప తగలేసే ఏలిన వారెందరో ౹౹చిత్రం౹౹

నెల నెలా భారీ జీతాలు ఉన్నగాని, బాధ్యతలు మరిచి చిన్న ఫైల్ కదిలించాలన్నా,

కనికరము లేకుండ, టేబుల్ కింద అమ్యామ్యాలకు ఎగబడు లంచావతారులు లక్షలు లక్షలు ౹౹చిత్రం౹౹

నిత్యావసరాలన్నీ ఉచితంగా చేసి, ప్రగతినంతా పైకి పంపించేసి,

యువకులందరిని సోమరులుగా మార్చి, ప్రజలందరికీ,

పన్నుల మీద పన్నులేసి, పైకి లేవకుండా పాతాళానికి నెట్టేసే ప్రభుత్వాలెన్నో ౹౹చిత్రం౹౹

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!