(అంశం::”చిత్రం భలారే విచిత్రం”)
సిత్తరాలు సూడరోయ్
రచన:: చంద్రమౌళి భవానీ శంకర్ శర్మ
సిత్తరాలు సూడరోయ్, విచిత్తరాలు కనిపెట్టారోయ్!
సిత్తరాలు సూడరోయ్,
మనస్సుల వైఖరి బహు విచిత్రమ్రోయ్!
ఉన్నోళ్లకి ఉందని మిడిసిపాటు రోయ్,
లెనోళ్ళకు లేదని విసుగుబాటు రోయ్,
పంచుకునే గుణం సన్నగిల్లిపోతున్న రోజులు రోయ్,
కారణం లేని తిరుగుబాటు పెరుగుతున్న కాలం రోయ్,
నాది నాది అనే తపనలలో రోయ్,
విలువైన బంధాలు వదులుకునే అసమర్థులు రోయ్,
చిత్రంగా యాంత్రిక జీవితం అందలం ఎక్కిన రోజులు రోయ్,
విచిత్రంగా రోగాలు కదం తొక్కిన కాలచక్రం మార్పు రోయ్,
ప్రేమ బంధాలు వీడి తెలియని గమ్యం చేరేందుకు తహతహలు రోయ్,
చేరాక ఏం చేయాలో పాలుపోని చోద్యం రోయ్,
అందని ద్రాక్ష పళ్ళు పుల్లనే రోయ్!
అందిన మామిడి పళ్ళు లెక్కలేదు రోయ్!
భళా! భళా! విచిత్ర మనసుల గారడీ రోయ్!
***