తండ్రి మనసు

తండ్రి మనసు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : మాధవి కాళ్ల

  నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పాడు సురేష్. రేయ్ నువ్వు ముందు జాబ్ తెచ్చుకో అప్పుడు నువ్వు చెప్పక ముందే నేనే వెళ్లి మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టాతాను అని చెప్పాడు శ్రీనివాస్  సురేష్ మొండివాడు , డబ్బు అంటే ఆశ ఎక్కువ, వాళ్ళ నాన్న దగ్గర మొహం మాట ఒక డబ్బు ఉన్న అమ్మాయిని ప్రేమించి తన ఆశలు , కోరికలు తీర్చుకొవాలని అనుకుంటాడు. తండ్రి అన్న మాట కోసం ఆలోచిస్తున్నాడు సురేష్. శ్రీనివాస్ ఒక మధ్యతగతి కుటుంబం గవరమెంట్ ఆఫీసులో ఉదోగ్యం చేసున్నారు. ఆయనికి ఇద్దరు పిల్లలు అమ్మాయికి ఒక నెల క్రితం పెళ్లి చేశారు. సురేష్ కి చదువు అబలేదు జులాయిగా స్నేహితులతో తిరుగుతూ కాలం గడుపుతున్నాడు. శ్రీనివాస్ భార్య సంవత్సరం క్రితం అనారోగ్యంతో చనిపోయింది. భార్య చనిపోయిన తరువాత పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. కూతురికి పెళ్లి చేసి ఒక బాధ్యత తీర్చుకున్నాడు. కొడుకు అలా జులాయిగా తిరగడం ఇష్టం లేక ఇంటర్వ్యూకి పంపిస్తూ ఉండేవాడు కానీ సురేష్ మాత్రం నాకు ఒక జాబ్ నచ్చలేదు అని అక్కడ మనుషులు నచ్చలేదని ఏవేవో కారణాలు చెప్తూ  తప్పించుకునే వాడు. డబ్బు మీద మక్కువతో పంచ కట్టడం బైక్ రైడింగ్ లాంటివి చేసేవాడు సురేష్ ఒకరోజు బైక్ రైడింగ్ లో సురేష్ కి బాగా దెబ్బలు తగిలాయి డాక్టర్లు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అంటున్నారు జాగ్రత్తగా చాలా బాగా చూసుకునే వాడు శ్రీనివాస్.. తన ప్రేమించిన అమ్మాయి కానీ తన స్నేహితులు కానీ ఎవ్వరూ రాలేదు చాలా బాధపడ్డాడు సురేష్.. ఎందుకురా బాధ పడుతున్నావు ఇప్పుడు నీకు దెబ్బలు తగిలాయని నీ స్నేహితులు కానీ , నిన్ను ప్రేమించిన ప్రేమించిన అమ్మాయి కానీ ఒక్కరే వచ్చారా అని అడిగాడు శ్రీనివాస్.. నాన్న నన్ను క్షమించు ఈ మాట వినకుండా తప్పు చేశాను ఇప్పుడైనా నీ మాట విని చక్కగా ఉద్యోగం చూసుకుంటాను అని బాధపడుతూ చెప్తాడు సురేష్.. రెండు రోజుల తర్వాత రిటైర్ అవ్వబోతున్నట్లు తెలుసుకొని కొంచెం ఆనందపడ్డాడు తర్వాత బాధ పడ్డాడు సురేష్ కి  ఈ జాబ్ ఎలాగైనా  ఇప్పించాలని తన ఉద్యోగాన్ని  తన కొడుక్కి ఇవ్వాలని పై అధికారులను కోరాడు శ్రీనివాస్.. శ్రీనివాస్ ప్రవర్తన చూసి అతని నీతి నిజాయితీలు చూసి ఉద్యోగం సురేష్ కి ఇవ్వడానికి ఒప్పుకున్నారు అధికారాలు. సురేష్ ఒక రోజు ఎప్పటిలాగే ఆఫీస్ కి వచ్చాడు. ఒక పెద్దాయన వచ్చే బాబు మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగాడు బాగానే ఉన్నారు అని చెప్పాడు సురేష్. మీ అమ్మకి అనారోగ్యంగా ఉన్నప్పుడు నా దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నారు కానీ ఆయన ఇచ్చేసారు అనుకో, చాలా బాధపడ్డాడు మీ నాన్నగారు మీ అమ్మ గారిని ఏదో పెద్ద జబ్బు చేసింది అని దానికి ఎంతో ఖర్చులు అవుతాయి అని డాక్టర్ చెప్పారు. కానీ మీ అమ్మ గారు ఒప్పుకోలేదు అని మీ నాన్న గారు చెప్పారు ఆ డబ్బులతో నీకు కాలేజ్ ఫీ కట్టమని చెప్పింది అని చెప్పాడు సరే బాబు నేను ఇంకా వెళతాను అని చెప్పి వెళ్ళిపోయారు ఆ పెద్దాయన. సురేష్ ఆలోచనలలో పడ్డాడు. గతంలో తన తండ్రిని ఎన్ని మాటలు అన్నాడో అని గుర్తు చేసుకొని గతంలో కి వెళ్ళాడు. ఆరోగ్యం బాగా లేక బాధ పడుతున్నాను వాళ్ళ అమ్మని చూసి సురేష్ వాళ్ళ నాన్న ని అనకూడని మాటలు అన్నాడు. తనకి దెబ్బలు తగిలినప్పుడు శ్రీనివాస్ చేసిన సేవలు గుర్తుకి వచ్చి చాలా బాధ పడ్డాడు. తన తండ్రి మనసుని అర్దం చేసుకొని బాగా చూసుకుంటున్నాడు సురేష్. శ్రీనివాస్ తన కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు సురేష్ మరదలు ప్రియ. తను డబ్బు ఉన్న అమ్మాయిలా నటించామని అడిగాడు శ్రీనివాస్. దానికి ప్రియ, నా చెల్లెలు శారద ఒప్పుకున్నారు అని చెప్పాడు సురేష్ కి. తన తండ్రి మనసుని అపార్థం చేసుకోకుండా నా భవిష్యత్తు కోసం నువ్వు చేసిన త్యాగానికి చాలా సంతోషంగా ఉంది నాన్న అని కన్నీళ్లతో కౌగిలించుకున్నాడు శ్రీనివాస్ ని. నా తండ్రి మనసు ఎంతో మంచిది అని అనుకొని తన తండ్రి కి ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు సురేష్, ప్రియలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!