సుడిగుండం

సుడిగుండం!

రచన:బి హెచ్.వి.రమాదేవి

ఉదయంవర్షంపడుతుంది. ఉరుములు ,మెరుపులు ఇంత వర్షమే! అకాల వర్షం ,రేపు ఇక ఎండ అదరేస్తుంది. కృప బట్టలు లోనే దం డెం పైనే వున్నా గ్రిల్స్ లోని జల్లు పడకుండా తీసి తలుపులు పై వేస్తుంది.
“అమ్మా! నీకెన్ని సార్లు చెప్పాలి.తలుపులు పైన అసహ్యంగాఉంటాయి.”విసుగ్గా అంది.స్టెల్లా
“మీ నాన్న రాజమహల్ కట్టించారేమిటీ!? ఏదో జీసస్ దయవలన సింగిల్ బెడ్ రూమ్ అమిరింది.”
అమ్మకు తండ్రిని సాధించ డానికి వచ్చే ఏ అవకాశాన్నీ
జార విడుచుకోదు. తనలో తను అనుకుంది స్టెల్లా!
“సరే! నేను బయటకు వెళుతున్నాను. గొడుగు తీసుకుంది.”స్టెల్లా .
“ముందు అసలు విషయం తేల్చి వెళ్ళు!” తల్లి కృప
“ఏ విషయం! ముఖం చిట్లించి
విసుగుతో కను బొమ్మలు ముడి వేసింది”
“అనుకున్నా! అంతా తండ్రి బుద్ధులే, చెప్పరేం,” కృప
“అమ్మా! డాలీ ఇలా కూర్చో బంగారం!”
తల్లి మూతి మూడు వంకరలు తిప్పింది.
నిన్న మీ బావ ను పెళ్లి చేసుకోమని మీ అమ్మ అంటుంది కదా,!…అమ్మ అంటుంది అనడంలోనే అతనికి కూడా ఇష్టం లేదనే విషయం అర్థమైంది.డాలీ అనబడే స్టెల్లాకు …
నేను 6 నెలల కన్నా బ్రతక నని డాక్టర్స్ అంటున్నారు కదమ్మా!
ఎవరు చెప్పారు నాన్నా!అబద్ధం,మీకేమి కాదు! ఆయన. బుగ్గకు,బుగ్గ ఆ న్చి దగ్గరకు తీసుకుంది.ఆయన కళ్ళు చెమర్చాయి.కొంచం దగ్గు పొర కమ్మింది.తండ్రిసామ్యూల్ కి
స్టెల్లాకు కోపం ముంచు కొచ్చింది.ఎవరైనా ఇలా చెబుతారా!? మనుషులు నీరుగారి పోయి దిగులు పడరూ!.ఇటువంటప్పుడే అమ్మ సవతి తల్లి లా కనబడుతుంది.ఈ లోకానికి తెలియదు గానీ,తమ వాళ్ళతో
బంధుత్వం కలుపు కోవడానికి
కొంతమంది తల్లులు ,తండ్రులు,
బిడ్డల ఫ్యూచర్ కూడా ఫణం గా పెడతారు.ఇప్పుడు స్టెల్లా జీవితం అదే అయ్యింది.
“సరే వస్తాను నాన్న!”
రావడం కాదు.వచ్చేముందు దావూద్ నీ పెళ్లి చేసుకునే నిర్ణయంతో రా! అంతే!
*నా మాటే శాసన మన్న శివగామి లాగా చెప్పింది.*
జీవితం అయోమయం లో పడినట్లు,తాను సుడిగుండం లో ప డి కొట్టుకుంటున్నట్లు,
ఒకటే తల బాధ!
కాలేజ్ దగ్గర కాఫీ షాప్ వుంటే
అటు కదిలింది.తనకు ఈ సంవత్సరం ఆగితే క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో ఏదో ఉద్యోగం వస్తుంది.కానీ తాగుబోతు,అనుమానపు పక్షిని బావను చేసుకోమని అమ్మ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఏడుపొస్తుంది.చైర్ లో కూర్చుంది.
సడెన్ గా ” ఏటే స్టెల్లా! ట్రాక్ మీద కొచ్చే శావేటి!? ఎవరికోసం నిరీక్షణ,!?
వెకిలిగా నవ్వుతూ అన్నాడు.
నిజానికి దావూద్ మన హిందీ సినిమా విలన్ లా అందగాడు.కానీవాడి వెకిలి చూపులు మాటలు,ముఖ్యంగా యేమే, ఏ టే అనే పదాలు తనకు అసహ్యం. తాను అతడు చిన్నప్పటి నుండి కలిసి కూడా పెరగ లేదు.దుబాయ్ వెళ్లి బాగా సంపాదించాడట.పడిమందినయినా చేసుకుంటా! నాకేటి??
ఈ వే ఆఫ్ టాకింగ్ తనకు నచ్చదు.
“కాలేజ్ కి వెళతాను బావా!?”
“వెళ్ళు! నేనొచ్చానుగా ఇక ఆ డెవడో వస్తా డే టీ,!”
“ఛీ ఛీ! నేను నీ లాంటి దాన్ని కాదు! “విసురుగా జడ వెనక్కు వేసుకుని కాలేజ్ లో అడుగు పెట్టింది.
వెళ్లి రమా మేడం ను కలవాలి.
తనను తల్లి చెవుల పోగులు,తాడు, నల్లపూసలు పెట్టీ గోదాట్లో దిగి చస్తాను.అనే బెదిరింపు,బావ వైఖరి,తండ్రి ఆరోగ్యం.ఈ సమస్త నుండి బయట పడే మార్గం ఆమె చెప్పాలి.మేడం! పాఠాలు మాత్రమే చెప్పరు.బావ లాంటి వాళ్లకు గుణ పాఠాలు,నాలాంటి వారికి ఆత్మస్థైర్యం ఇస్తారు. ఆమె.నడచి వచ్చే ఆత్మ స్థైర్యం లా ఉంటారు.ఉదయం ఏ ఫ్రెష్ నవ్వుతో ఉంటారో,వెళ్ళే టప్పుడు కూడా అదే చిరునవ్వు అని చాలామంది లెక్చరర్స్ కూడా మెచ్చుకుంటారు.
నెమ్మదిగా స్టాప్ రూమ్ వైపు నడిచింది. స్టెల్లా అనబడే ఎస్టెల్లా !
“మేడం! మీతో మాట్లాడాలి!”
“ఎప్పుడు ఫ్రీ మేడం!” స్టెల్లా!
ఈ రోజు 4_15 సాయంత్రం వరకూ క్లాసులు! పోనీ.urgent అయితే లంచ్ చేస్తూ మాట్లాడుదాం!
తను లంచ్ కూడా తేలేదని ఎలా చెప్పాలి.
రమా మేడమ్ గమనించారు.
నీకో సర్ప్రైజ్ ఈ రోజు నీ లంచ్ ఆటమ్మకిచ్చే సెయ్యి,నేను పనస పొట్టు కూర ఆవపెట్టి వండు కొచ్చాను. ఒకసారి ఎలా వండాలి అన్నావు కదా,!
ఈ రోజు టెస్ట్ చేద్దువుగాని..
మేడం! సూక్ష్మ గ్రాహి! పూర్వ భాషి! గర్వం లేకుండా తానే మాట్లాడుతారు. ఎన్ని అవార్డ్స్ వచ్చాయో!నన్ను hurt చేయకుండా భోజనం పెడతానని సున్నితంగా చెప్పారు.
“,ఏయ్! స్టెల్లా! ఏమిటీ ఆలోచన..వస్తావు కదూ!
ఎవైటింగ్ యూ,!
అదేచిరునవ్వు , అలాగే మేడం!
లంచ్ తీసుకుని స్టెల్లా క్లాస్ రూం వైపు నడుస్తున్న రమా మేడం ను కామెంట్ చేశారు.తోటి లెక్చరర్స్,అస్సలు డిస్టెన్స్ మెయింటైన్ చేయదు…హు!
అదే చిరునవ్వు మళ్ళీ!
గమ్యం చేరాక కన్నీళ్ళతో
చెప్పింది తింటూ స్టెల్లా!
ఏయ్! కారం ఎక్కువవ్వ లేదు కదా!”
“మమకారం ఎక్కువయ్యింది మేడం!”
నీ వన్నీ నా పోలికలే, ఆ ఏడుపు తప్ప!
“కన్నీళ్లు విలువైన వాళ్ళ కోసం దాచుకోవాలి.”
స్టెల్లా చెప్పింది అంతా విని,
ఒకసారి నిట్టూర్చి ఈ విధంగా
మాట్లాడింది రమా మేడం!
అమ్మాయిలను తండ్రి ప్రేమిస్తాడు, ఇప్పుడు ఆయన స్థితి బాగోక ,మీ అమ్మగారికి ఎదురు చెప్ప లేక పోతున్నారు.
మీ అమ్మగారి బ్లాక్ మెయిల్ సంగతి అంటావా! ఆమె అస్సలు చని పోరు,చూడు,చావడానికి వెళుతూ కూడా బంగారం మీకే చెందాలని అనుకుంటున్నారా లేదా!? అంటే మీ పై అంత మామ జార మన్న మాట.ముందు పెళ్లి పోస్ట్ పోన్ చెయ్యి.కొన్ని విషయాలను పోస్ట్ పొన్ చేస్తే పరిష్కారం. మరికొన్ని చేయకూడదు.రెండేళ్లు ఆగమను.జాబ్ వస్తుంది. ఒకే నా!!
సరే మేడం! ఆ సలహా నచ్చింది.
కానీ వాళ్ళ బావ అంతదాకా వెయిట్ చేయలేక పోయాడు. ఓ అమ్మాయిని ప్రేమించి ఆమె చున్నితోనే ఉరివేసి చంపి,ప్రస్తుతం సెంట్రల్ జైల్ లో వున్నాడు.
ఆరు నెలల్లో చనిపోతా డనుకున్న వాళ్ళ నాన్న ఈ రోజుకి చనిపోలేదు. కానీ స్టెల్లా కు క్యాంపస్ లో 6 జాబ్స్ వచ్చాయి.పి. జి.చదివే వీలున్న జాబ్ కి వెళ్ళి, అబ్బాయిని చేసుకుని సుఖంగా ఉంది.అయోమయం కు సమాధానం కొంచం ధైర్యం చేస్తే దొరుకుతుంది.ఆ విషమ పరిస్థితి నుండి బయట పడవచ్చు.వాళ్ళ అమ్మా,నాన్న గార్లు రోజూ రమా మేడం ను తలచుకోకుం డా ఉండలేరట.
బాగుంది కదూ!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!