ఎప్పుడు తెగునో నీ బానిస

(అంశం:”బానిససంకెళ్లు”)

ఎప్పుడు తెగునో నీ బానిస

రచన: నాగ రమేష్ మట్టపర్తి

పసితనం నుంచి ” పుట్టినింట ”
” పుత్తడి బొమ్మ ” గా పెరిగిన పడతి…
మూడు ముళ్ళనే పాశం తో
నూరేళ్ళ నవ జీవితానికి
నూతన ఆశలు నింపుకొని…
మనసు ముడిపడిన మగడిపై
మమతానురాగాలు పెంచుకుని…
” మెట్టినింట ” ముచ్చటగా అడుగిడగానే
” మట్టిబొమ్మ ” గా మారి…
అత్తామామల, ఆడపడుచుల వేదనలకు,
మగడి తీరుకు మనసు ముక్కలవుతుంటే
రాత్రింబవళ్ళు రోదిస్తూ…
నిరంతర సమస్యలే నుదిటి రాతగా…
ధైర్యము, తెలివితేటలు దండిగా ఉన్ననూ
ఓర్పు, సహనమే స్నేహితులుగా చేసుకుని…
ఎప్పటికీ ఎదురించక,
తప్పక తలవంచాల్సిన పరిస్థితియే
తలరాత గా మార్చుకున్న…..
ఓ తరుణీ…..!!!
మెట్టినింటి “బానిసత్వ సంకెళ్ళు” తెంచి…
స్వాగతించు ” బంగారు వాకిళ్లు ” ఎప్పుడూ తీసేరో……

…………………………….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!