పల్లెటూరు పిల్ల

పల్లెటూరు పిల్ల
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు లేలేత కిరణాలు పల్లె అంతా పరచుకున్నాయి. రాఘవ రావు గారు అప్పటికే లేచి స్నామాచరించి పూజ చేసి కాఫీ ఘుమ ఘుమ ల కోసం ఎదురు చూస్తున్నారు, రమణి ఇవ్వాళ ఇంకా కాఫీ రాగం వినిపించలేదు అన్నారు, రామన్న పొలం నుంచి పాలు తేలేదు అందుకని కాపీ రాగం వినిపించ లేదు. మీ అమ్మాయి మోహన కళ్యాణి రాగం వీణపై ఆలపిస్తూ ఉన్నది అదివిని సరి పెట్టు కొండి ఎందుకు వాడు ఆలస్యం చేశాడో సైకిల్ ట్రబుల్ ఇచ్చి ఉంటుంది. స్కూటీ ఇస్తాను తీసుకెళ్ళి వాడు కోరా అంటే వద్దు సార్ నాకు ఇదే సుఖం మంచి ఎక్సర్సైజ్ అంటాడు. ఎవరి అలవాటు వారిది
ప్రపంచం సిటీకి పరుగు పెడుతుంటే మనం పల్లెలో లేమా ? అవకాశం వచ్చింది  రమణి దెప్పింది
ఓ ఆడ పిల్లాడికి అవసరం అంటే వెళ్ళాము వచ్చాము సిటీ సరదా తీరింది కదా, చిన్న పిల్ల మోహన పెళ్లి అవుతే కానీ నేను పల్లె విడువను అన్నాడు. అప్పుడే సంవత్సర ముల మార్పు వచ్చేస్తోంది. పండుక్కి రమ్మన మని పిలువాలి
అవును ముందు బుక్ చేసుకోండి అని చెప్పాలి
ఎందుకే కార్లో వస్తారు. రైల్లో చిన్న పిల్లలతో ఎంతో కస్టము కదా అంతదూరం డ్రైవ్ చెయ్యడం కష్టం కదా. సరే మీ ఇష్టం వాడి ఇష్టం ఈరోజు ఈ ఇంట్లో నా మాట చెల్లింది చెప్పండి, విసురుగా వంటింటికి వెళ్ళింది. ఫ్రిజ్ లో రాత్రి పాలు ఉన్నాయి కానీ రాఘవ అవి తాగ డు, ఏమిటో వింత స్వభావం పల్లెటూరు జీవితము ఇంతే అన్ని ఫ్రెష్ అంటారు అదే పట్నం లో అయితే ఫ్రిజ్ లో కుక్కుకుని
ఏడాది తింటారు. అప్పుడే పితికిన పాలు ఉండాలి
ఈ లోగా గేటు చప్పుడు అయ్యింది. పాల క్యాన్ అరటి గెల సైకిల్ కి కట్టుకుని వచ్చాడు తువ్వాలు నల్ల వంకాయలు తెచ్చాడు. ఏరా ఏమిటి ఆలస్యం నేను కాఫీ తాగే కుండా ఉండ లేను కదా అన్నాడు
ఇవేమీ పట్టించుకో కుండా సైకిల్ స్టాండ్ వేసి పాల క్యా న్ వంకాయలు తువ్వాలు విప్పి అరుగు మీద పోశాడు. ఏమిటి రా ఇవన్నీ తెచ్చావు అయ్యా మన రాయుడు గారు పొలంలో అరటి గెల పెట్టాం వంకాయలు కోసి పెట్టాడు పట్టు కెళ్ళ మని చెప్పారు అందుకు రెండు సార్లు ఎందుకు ఇప్పుడు పట్టు కెళ్లు ఈ పూట గుత్తి వంకాయ కూరముద్ద పప్పు వండుకుని తింటారు. ఇంట్లో అంతా నువ్వు కూడా తిను అని చెప్పారు అండి అన్నాడు. ఏమిటో ప్రక్క పొలం వాళ్ళు చెప్పింది వేదం అయ్యింది నేను
చెప్పింది నీకు ఎక్క లేదు, నేనే కాదు ఆ ధాన్యం పురి మీదున్న పిచ్చుకలు కూడా కిచ కిచా లాడుతున్నాయి. వాటికి గింజలు నచ్చ లేదు
ఏడాది ధాన్యం నల్ల పాయి ఎఱ్ఱ పాయ్ అంటూ అమ్ముడు పోలేదు చివరకి తక్కువ ధరకు ఇచ్చాము అందులోనే కొన్ని పురి కట్టడం వల్ల రుచి మారాయి
ఆ పిచ్చుకలు కూడా తిండి రుచి కోసం వెంపర్లాడు తున్నాయి. పిట్ట, పక్షి , జంతువు , మనిషి ఎవరికైనా సరే రుచి కావాలి ఇంతకీ అరటి గెల అప్పుడే తెచ్చావు ఆయన మార్కెట్కు కి పంపుతున్నారు
మరి ఉగాది ఉస్తవాలు వారం ముందు నుంచే మొదలు మనం ముందే వేప పుతా మామిడి కాయలు రెడీ చేసుకోవాలి అన్నాడు ఇదేమి పట్నం కాదు కదరా అదికాదు అయ్యగారు మన సరుకంతా సిటీకి వెళ్లి పోతుంది. మనకు చెట్లు మిగులు తాయి.
పదార్ధాలు వస్తువులు అన్ని కూడా సిటీ లో పెద్ద పెద్ద మాల్స్ లో మెరిసే రంగు రంగు కాగితం సంచుల్లో అమ్ముతారు అని రాయుడు గారు చెప్పారు. ఆహా ఆ పురాణం వింటూ నాకు పాలు తేవడం ఆలస్యం చేశావు సంతోషం చాలా విషయాలు రాయుడు చెప్పాడు అక్కడ వాళ్ళ అల్లుడు ఇదే బిజినెస్ పల్లెల నుంచి పాతకాలం టేకు పెట్టాలి మొర్మెన్ పెట్టెలు కావి డీ పెట్టెలు ట్రంక్ పెట్టెలు కూడా అమ్ముతారు పురావస్తు వస్తువులు కొందరు కోని  వాటిని విదేశాలకు పంపుతారని చెప్పాడు ఆ మధ్య మా ఇంట్లో ఉన్న పాత పెట్టెలు గురించి నగిషీ సోఫాలో గురించి వచ్చి , ఈ మోడల్ పాతది మీరు మర్చెయ్యందు మంచి కుషన్ ఫర్నీచర్ నేను పంపుతాను ధర కూడా బాగా ఇస్తాను అని చెప్పాడు
నాకు అనుమానం వచ్చింది. పెద్దలు ఇచ్చిన సొత్తు దాన్ని దాన్ని అమ్మడం ఎందుకని ఉంచాను
అదేవిధంగా  మా వాళ్ళతో అంటే అది అతని విదేశీ బిజినెస్ అని చెప్పారు. దానితో అదా అసలు విషయం అని తెలిసింది. ఆ మధ్య మా మేనల్లుడు కెనడా నుంచి వచ్చాడు. వాడు మామయ్య ఈ ఫర్నీచర్ మాత్రం అమ్మకు ఈ మోడల్ విదేశాల్లో మంచి రేటు అన్నాడు అవును నిజమే కదా ఓల్డ్ ఈ జ్ గోల్డ్ అన్నట్లు వాటిని తాతల.పేరున జాగ్రత్త పెట్టాలి. ఎన్నో తరాలకు వాటి విలువ తెలియాలి.
పోని నువ్వు పట్టు కెడతావ అంటే ఇప్పుడు వద్దు నేను ఇంకా చదువు లో ఉన్నాను. ఇండియా లో ఉద్యోగం లో చేరాక ఆలోచిస్తాను అన్నాడు. నేడు వృద్ధులే పనికి రావడం లేదు ఇంకా వాళ్ళ వస్తువులు ఎవరికి కావాలి. ఏవో చిన్న సైజ్ బహుళ అంతస్తుల భవన సముదాయాలు వాటిలో ఈ రకం చిలకల పందిరి మంచం ఇనప్పెట్  కావి డీ పెట్టే ట్రంక్ పెట్టే ఎవరికి కావాలి ట్రక్ లో సామాను చూసి మనిషి జీవితం అంచనా వేస్తారు కనుక అంతా కొత్త పద్దతి సామాను కోని పెద్ద పిల్లకి సారే పెట్టారు ఇంకా రెండో పిల్ల అంతే అనుకున్నారు కానీ మేనల్లుడు రాజేష్ వచ్చి కొత్త విషయం చెప్పాడు పిల్లని దూరం సంబంధం చెయ్యడం ఇష్టంలేదు పేపర్లో
ఎన్నో మో సాలు దగాలు గురించి విన్నాడు
పల్లె టూరు పిల్లలు మంచి పని మంతులే కాక  పెద్దల అంటే వినయ విధేయతలు ఉంటాయి అని పొగుడుతారు కానీ అవన్నీ కాదు ఆరోగ్యం శాంతం అన్ని ఉంటాయి అన్ని విధాలా మంచిది డబ్బు ఉంటుంది పని ఉంటుది అందంగా ఉన్న పిల్ల అయితే మరి మంచిది కదా, మంచి ఆరోగ్యం మంచి తెలివి ఏ చెడ్డ గుణాలు ఉండవని ఆశతో పెళ్లి చేసుకుని  వారు ఆ తరువాత నా నా భాధలు
పెడుతున్న విషయం పేపర్లో వచ్చింది. భార్య అని చూడకుండా రక రకాల భాధలు పడుతున్నారని
న్యూస్ లో కూడా చెప్పారు. అందుకే మేనరికం పెళ్లి మంచిది కాదన్న రక రకాల భయంతో రెండో పిల్లని కూడా దగ్గర సంబంధం చెయ్యాలని ఆశించాడు. మోహన పెళ్లి మేనల్లుడి తో చెయ్యాలని ఆశ వ్యక్త పరిచారు పెద్ద వాళ్ళు సరే అన్నారు. అదే విధంగా ఈ వేసవిలో పిల్ల కి డిగ్రీ అవుతుంది పెళ్ళిచెయ్యలని నిర్ణయం చేశాడు ఏమిటి? పక్షులను రక్షించండి
పిచ్చుకలు సెల్ టవర్ నుంచి కాపా డండీ ఆ డ పిల్లను రక్షించండి. పిండ దశలో రక్షించిన విద్య విషయంలో ఆలోచించి కాపాడిన పెళ్లి విషయంలో తల్లి తండ్రులు ఏ విధంగా జాగ్రతలు తీసుకున్న ఉద్యోగ సమస్యలు ఎదుర్కొన్న జీవిత విషయం లో ఎన్నో ఆంక్షలు ఉంటున్నాయి. అందుకే ఆడపిల్లను కనడం పెంచడం అన్ని సజావుగా జరిగినా పిల్ల పెళ్లి విషయంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి.
ఎటుచూసి ఎటు అయినా ఆడ పిల్ల తల్లి తండ్రుల దే భాద వారి ఇంట్లో పెళ్లి కాని పిల్లలు ఉన్నా వారిని ఏమి అనరు వచ్చిన కోడల్ని సత్త ఇస్తారు ఈ మార్పు ఎప్పుడు? పిచ్చుక జాతుల మాదిరి ఈ రోజుల్లో ఆడపిల్లలు కరువు అయ్యారు. మగ పిల్లల పెళ్ళిళ్ళు అంతంత మాత్రం గా మిగిలాయి అడ పిల్ల శ్రీ మహా లక్ష్మీ అని పూజించి గౌరవించిన నాడే మంచి పురోగతి. డబ్బు భద్రంగా దాచినట్టు ఆడపిల్ల జీవితం అత్త ఇంట భద్రం కోసం అందరూ ఆలోచించాలి నేటి తరంలో ఆడపిల్ల కూడా ఒక విచిత్ర పరిణామమే ఇంజినీర్ డాక్టర్ పెద్ద చదువులు పిజి లు వాళ్ళే ఉన్నారు. ఎవరి బ్రతుకు వారు బ్రతికే స్థితికి ఆడపిల్ల జీవితం పరిణామ చెందింది. అలనాటి నుంచి కుటుంబ పోషణలో కూడా ముఖ్య పాత్ర వహిస్తోంది. అందుకే నేటి తరం ఆడపిల్లలు ఎంతో మార్పు తెచ్చుకున్నారు. గొంగళి పురుగు మేటమర్ఫాసిస్ ద్వారా సీత కొక చిలుక గా మారినట్లు వీళ్ళు మారే పరిస్తితి సమాజం తెచ్చింది
అందుకే ఆడపిల్ల జీవిత నాటకం లో ఎన్నో వింతలు విడ్డు రాలు కూడా నా నాటి బ్రతుకు నాటకము అన్న అన్నమయ్య. శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన ప్రకారం జీవితంలో ఎన్నో మార్పులు విలువలు ఎటు పయనమో ఎవరూ చెప్పగలరు. ప్రతి క్షణము మనిషికి ఆవేదన అలోచన ఉంటున్నాయి
కానీ జీవితం వదిలి ఎవరూ జీవించ లేరు. అనే అంశాలు వ్యక్తమవుతున్నాయి. జీవిత కెరటాల లో ఎన్నోరకాల గవ్వలు రాళ్ళు కానీ ముత్యాల కోసం వెతకడం జీవితము కదా!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!