జడివాన

జడివాన

రచన: యం.సుశీలరమేష్.

జడివాన కురవంగా
పుడమి మురివంగా
ఆమని ఆడంగా
ప్రకృతి పులకించగా

హలము పట్టిన
రైతన్న సంతసించగా
పసిడి పంటలు
కన్నుల పండువుగా

తరంగణిలు తరించగా
తటాకములు ఉప్పొంగగా
పిన్న లేమి పెద్దలే మీ
ఆడి పాడంగా

పడతులు నాట్యమాడగా
పడుచువాడి మది మురియగా
కొత్త జంటల ప్రణయకావ్యానికి
నిలచేవు నాందిగా

ఇన్ని అందాలను తిలకించిన
నా కన్నుల కాంతులీనంగా
మనసులోని భావనను ఉరకలు వేయంగా,

నా కలం ఈ కవనాన్ని లిఖించగా
జడివానలో ని జలకాలాటలలో
జగము మురిసేను మురిపెంగా.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!