కరుణ

కరుణ

రచన: నెల్లుట్ల సునీత

అంతరాలు మరచి హృదయాంతరాలలో కరుణ అనే చమురు పోసి వెలిగించు మానవత్వ జ్యోతులను

అభాగ్యుల అన్నార్తులను అక్కున చేర్చుకుని ఆకలి మంటలను చల్లార్చే వెన్నెల ధారల జీవామృతంలోను
ఉంది చూడు

ప్రకృతికి హాని తలపెట్టని మానవతా
హృదయ అంతరంగంలో తొంగి చూడు
ఉన్నదెంతో కరుణ రసం

అభం శుభం తెలియని అమాయక పసిపాపల బోసినవ్వుల మనసులో కనికరించేను కరుణరసం

నిరాశ్రయులకు నిస్సహాయులకు చేయూతనందించే
అభయ హస్తంలో హస్త్రమై నిలిచింది చూడు

చలించిన గుండెల్లో చెమర్చిన కన్నుల్లో
కరుణతో కనికరించి పులకరించిన
హృదయాలలో కొదవలేదు

కరుణ లేకున్నా సమస్త జీవకోటికి మనుగడె ప్రశ్నార్ధకం

భగవంతుని సృష్టిలో నిలిచింది సంజీవినిగా మొలిచింది

నవరసాలలో కరుణ లేకున్నా అష్టభోగాలున్నా వ్యర్థమే కరుణాన్వి తుడై మహిలో వెలుగు

***

You May Also Like

One thought on “కరుణ

  1. కరుణ రసం మీద బాగా వ్రాశారు మేడమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!