రెండేళ్ల చిన్నారి

రెండేళ్ల చిన్నారి

రచన: పద్మజ రామకృష్ణ.పి

లక్ష్మణ్ కు భార్య,నలుగురు పిల్లలు ఉన్నారు, భార్య పేరు వెంకటలక్ష్మి.

లక్ష్మణ్ డైలీ సీజన్ టికెట్ మీద వర్క్ రీత్యా బాపట్ల నుండి ఒంగోలు వెళ్తూ వస్తూ ఉండేవాడు. అనుకోకుండా సీజన్ వర్క్ వత్తిడి వలన కొన్ని నెలలు ఒంగోలులోనే ఉండవలసి వచ్చింది లక్ష్మణ్ కి.

నువ్వూ,పిల్లలు జాగ్రత్త!.అని పదేపదే భార్యతో చెప్పి బయలుదేరి వెళ్ళాడు లక్ష్మణ్

భర్త తెచ్చే జీతం చాలదు కాబట్టి,పిల్లల సంతోషాలకు ఎలాంటి లోటు రాకూడదు అని తనకు చేతనైన పని చేస్తూ కూలి డబ్బులతో కంటికి రెప్పలా ఎంతో ప్రేమగా చూసుకునేది పిల్లల్ని వెంకటలక్ష్మి.

వెంకటలక్ష్మి ఉండే ఇంటి పక్కనే టిఫిన్ అమ్ముకునే ఆవిడ పార్వతమ్మ ఇల్లు,ఆమె చాలా కాలంగా టిఫిన్ సెక్షన్ ఇంట్లోనే పెట్టుకుని కాలం గడుపుతూ ఉండేది.

అక్కడ అందరివి పూరిపాకలే చుట్టూ తడికల ఇళ్లు ఎక్కడో తప్ప డాబా ఇల్లు,పెంకుటిల్లు చాలా తక్కువగా ఉండేవి

‘అది ఎండాకాలం రోహిణికార్తె, పార్వతమ్మ పొయ్యి మీద బాండీ పెట్టింది గారెలు వెయ్యడానికని,

ఏం జరిగిందో తెలియదు! ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి ఒక ఇంటి నుండి మరో ఇంటికి శరవేగంగా మంటలు వ్యాపించాయి అక్కడంతా కేకలు ఏడుపులతో నిండిపోయింది.

‘ఆ తెల్లారి,ఉదయాన్నే లక్ష్మణ్ టిఫిన్ చెయ్యడానికి హోటల్ కి వెళ్ళాడు అక్కడ గుంపులు గుంపులుగా నిలబడిన జనం అయ్యో పాపం చాలా చిన్నపిల్ల మంటల్లో కాలి బూడిద అయిపోయింది అయ్యయ్యో అంటూ చెప్పుకుంటున్నారు

ఆ గుంపులో ఉన్న లక్ష్మణ్ ఫ్రెండ్ ఒకాయన గబగబా ముందుకు వచ్చి,చూసావా లక్ష్మణ్ ఈ గోరం మీ ఊరే అంటా పాపం రెండేళ్ల పసిది కాలి బూడిద అయిపోయింది గుర్తు పట్టలేని విధంగా అంటూ చెబుతున్నాడు

లక్ష్మణ్ ఆ పేపర్ తీసుకుని చూసాడు అందులో ఊరు పేరు,లక్ష్మణ్ వాళ్ళు ఉండే బజారు పేరు ఉండి అగ్నికి ఆహుతి అయిన రెండేళ్ల చిన్నారి అని ఉందే తప్ప చిన్నారి తాలూకా వివరాలు లేవు,ప్రమాదం జరిగింది తన ఇంటి దగ్గరే అని మాత్రం తెలిసింది . అప్పట్లో ఫోనులు.టీవీలు లాంటివి ఏమి లేవు అందుకే ఏదీ తెలిసేది కాదు పేపర్లో వచ్చే వరకు.

రెండేళ్ల చిన్నారి అనేసరికి లక్ష్మణ్ కు ఒళ్లంతా చెమటలు పట్టాయి తన నాలుగో సంతానం అయిన చిన్న కూతురికి కూడా రెండో సంవత్సరం కావడంతో హుటాహుటిన ఇంటికి వెళ్ళేందుకు బస్ ఎక్కేశాడు.

ఊర్లో అడుగు పెడుతూనే ఎందుకో గుండె బరువుగా మారింది లక్ష్మణ్ కి తను ఉన్న బజారు అంతా మసిపూసుకుని మౌనాన్ని సంతరించుకుని దీనంగా దహనమైన దారుల్లో దానం కోసం ఎదురుచూస్తుంది ఆ బజారు మొత్తం.

‘లక్ష్మణ్ ఇల్లు కూడా కాలిపోయింది’బావ అని పిలిచారు వెనుక నుండి ఎవరో,వెనక్కి తిరిగి చూసాడు లక్ష్మణ్ తను ఎవరో కాదు పక్క బజాట్లో ఉండే బావమరిది. అక్క.పిల్లలు నా దగ్గరే ఉన్నారు రండి బావ అని వెంటపెట్టుకుని తీసుకువెళ్లారు బావమరిది.

తండ్రిని చూసిన పిల్లలు పరుగులు పెడుతూ ఎదురు వెళ్లారు నాన్న నాన్న,అమ్మా నాన్న వచ్చాడు అని కేకలు పెడుతూ పిల్లలు ముగ్గురూ మన ఇల్లు కాలిపోయింది నాన్న ఇక మన ఇల్లు లేదు నాన్న అంటున్నారు.

లక్ష్మణ్ కళ్ళు మాత్రం రెండేళ్ల చిన్నారి అయిన నాలుగో సంతానం కోసం వెతుకుతున్నాయి,
వెంకటలక్ష్మి భర్తను చూడడంతోనే బోరున విలపించింది.

పిల్ల ఎక్కడ? నా చిట్టితల్లి ఎక్కడ.? అని లక్ష్మణ్ కంగారు పడుతుంటే’వెంకటలక్ష్మి ఏమో ఇల్లు కాలిపోయినందుకు ఏడుస్తోంది

అంతలో పెద్దపిల్ల వచ్చి నాన్న చెల్లి లోపల గదిలో నిద్రపోతుంది,నాన్న మరే చెల్లిదగ్గర ఆడుకోవడానికి వచ్చే సరిత కాలిపోయి చచ్చిపోయింది నాన్న అని చెప్పింది.

లక్ష్మణ్ కు అర్థం అయ్యింది ఇంటి వెనుక ఉండే చిన్నారి సరిత మ్యాటర్ ఉదయం తను పేపర్లో చూసిందే అని గ్రహించి చాలా బాధ పడ్డాడు లక్ష్మణ్.

నిద్రలేస్తూ లోపల నుండి ఏడుస్తోంది లక్ష్మణ్ చిన్న కూతురు,లోపలికి వెళ్ళి పిల్లను ఎత్తుకుని ముద్దాడుతూ మురిసిపోయారు లక్ష్మణ్

పోయింది ఇల్లు. వస్తువులే కాబట్టి మరల సంపాదించుకోవచ్చు దేవతలాంటి ఇలాల్లు, నా పంచప్రాణాలు అయిన పిల్లలు క్షేమంగా ఉన్నారు. నాకు అంతే చాలు దేవుడా అని గట్టిగా గాలి పీల్చుకున్నాడు లక్ష్మణ్.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!