నా నమ్మకం

నా నమ్మకం

రచన: సుజాత.కోకిల

“చిలిక జ్యోతిష్యం  చెప్తాను చిలుక జ్యోతిష్యం చెప్తాను  అంటూ! ఇంటి ముందు నుండి అరుస్తూ వెళ్తున్నాడు
చిలుక  జ్యోతిష్యం  చెప్పేవాడు ఆ మాట వినగానే విన్నీ లోపల్నుండి పరుగున వచ్చి అమ్మ నేను జ్యోతిష్యం చెప్పించుకుంటానమ్మ అంది!అలా చెప్పించుకోకూడదు ప్లీజ్ అమ్మా నేను  చెప్పించుకుంటాను.వద్దు తల్లి చెప్తే వినాలి కదా అంది. ఎందుకని నీవెప్పుడూ అలాగే అంటావు నా ఫ్రెండ్ రజిత  చెప్పించుకుంటుంది.వాళ్ల అమ్మ ఏం అనదు నీవె ఎప్పుడూ ఆంక్షలు పెడతావు? అంటూ బుంగమూతి పెట్టుకుని లోపలికి వెళ్ళబోయింది.

ఆగమ్మ !ఎందుకు ? అంత కోపము.మేము చెప్తే నీవు ఎందుకు వింటావు వినవు కదా నీ పట్టుదలే నీకు ముఖ్యం.సరే లేమ్మా పిలువు అన్నాను.తన కోపం తట్టుకోలేక  సంతోషంతో పరుగున వెళ్లి  చిలుక జ్యోతిష్యం అబ్బాయిని ఇలారా అంటూ పిలిచింది. వస్తున్నానమ్మా మీ అదృష్టాన్ని  పరీక్షించుకోండి అంటూ గేటు లోనికి వచ్చాడు.

జరిగింది చెప్తాను జరగబోయేది చెప్తాను ఉన్నది  ఉన్నట్టుగా చెప్తాను. అంటూ అరుగు చివర కుర్చున్నాడు ఇలా కూర్చో తల్లి అన్నాడు.తనువచ్చి ఎదురుగా కూర్చుంది. తన చిన్న పంజరము లో ఉన్న చిలుకతో చిలకమ్మ తల్లి రామ్మ ‌‌! ఈ దోరషానికి మంచి చీటీ తీసి పో అంటూ పంజరంలో ఉన్న చిలుకను మెల్లిగా బయటకు వదిలాడు.అది భయం భయంగా అటూ ఇటూ చూస్తూ గబుక్కున చీటి తీసి మళ్లీ పంజరములోకి వెళ్ళింది.

ఆ చీటీ తీసి చదువుతూ నీ నోసటి గీత  బాగుంది తల్లి   నీవు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతావు విదేశానికి వెళ్తావు నీది బంగారు జాతకం గొప్పింటి దొర వస్తాడు నీ చేయి పెద్దది అడిగినోళ్లకు అడిగినట్టుగా పెడతావు నీ మనసు పెద్దది  నీది దానగుణం తల్లి ఏదేదో వాగుతున్నాడు కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టుగా చెప్తూనే వున్నాడు. సరే లే నాయన అంటూ  తల్లి అంజనా వచ్చి అతని చేతిలో వంద కాగితంపెట్టి వెళ్లి రా నాయన అంది! లోనికి వెళుతూ అతని కళ్ళల్లోకి చూసాను. చెప్పలేని ఆనందం కొట్టవచ్చినట్టు, కనబడుతుంది. ఆ వందనోటు ఎన్నడూ చూడనట్టుగా చూశాడు.

ఒక్కసారి చిలుక  వైపు కూడ చూసాను నా వైపు జాలిగా చూస్తున్నట్టుగా, ఉంది. నాకు స్వేచ్ఛ కావాలి! నాకు ఎగరాలని ఉంది.అన్నట్టుగా జాలిగా  కనిపించింది. నాకు చాలా బాధగా అనిపించింది. కానీ ఏమి లాభం?మళ్లీ దాని  వైపు చూస్తే నా వలన ఒక కుటుంబానికి జీవనోపాధి అయినందుకు నాకు  సంతోషంగా చాలా తృప్తిగా వుంది. నాకు ఈ తృప్తి  చాలు నావైపు చూసి నవ్వీనవ్వనట్టుగా ఆ కళ్ళల్లో మెరుపు కనబడింది.

సరే నేస్తమా వెళ్ళిరా అన్నట్టుగా ఒక నవ్వు నవ్వి  లోపలికి వచ్చాను. మళ్లీ  విన్నీ అమ్మ  అంటూ నా దగ్గరగా వచ్చి అమ్మ  అతను చెప్పినవన్నీ నిజమే అవుతాయా అని అడిగింది.విన్ని మాటలకు నవ్వి  ఇలాంటివి పిల్లలు అడగకూడదు ?అంది ఎందుకు “విన్నీ నీవు  మంచిగా చదువుకోవాలి. చదువుకునే పిల్లలు ఇవన్నీ పట్టించుకోకూడదు. నీ ఏకాగ్రత నీ చదువుపై  ఉంచాలి అప్పుడే నీవు బాగా చదువుకుంటావు అని చెప్పింది.ఇవన్నీ నీకు ఇప్పుడు   ఎందుకు చెప్పు ఈ వయసు నుండే చాదస్తాలు అవన్నీ పిచ్చి నమ్మకాలు వాటిని ఎందుకు నమ్మాలి  వాటిపై ఎందుకు  ఆధారపడాలి.ఒకసారి అతను  చెప్పినవి  చెప్పినట్టుగా జరగకపోగా నీకు వేరేలా జరుగుతెే నీవు చాలా బాధపడతావు నీకు చదువుపై ఉన్న ఏకాగ్రత సడలిపోతుంది నీ ఫ్యూచర్ పాడవుతుంది.అందుకనే ఈ మూఢనమ్మకాలను  పిల్లలు ఎక్కువగా  నమ్మకూడదు అనేది నా ఉద్దేశ్యం

నీ టాలెంట్  ను నమ్ముకొని నీ ఏకాగ్రత చదువుపై దృష్టి  ఉంచాలి అప్పుడే నీవేంటో నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకు ఎన్ని సమస్యలొచ్చినా ఎదుర్కోగలిగే శక్తి నీకు ఉంటుంది. అంది  మా ఫ్రెండు రజిత ఎప్పుడూ చిలుక జ్యోతిషం చెప్పించుకుంటుoది.  దానికి చాలా నమ్మకం అంది. ఎవరి నమ్మకాలు వారికి   ఉంటాయి.తనకు మంచి  జరిగిందని నీకు అలా జరగాలని లేదు కదా  అప్పుడు నీవు చాలా  బాధపడతావు? చదువుకునే పిల్లలు ఇలాంటివి ఏవి నమ్మకూడదు. అదేంటోనమ్మ  రజిత ఎప్పుడూ నాకు కరెక్ట్ అవుతుంది. అని చెప్పుతుoది.నీవు అలా నమ్మడం నాకు నచ్చదు అందుకే నీకెప్పుడూ చెప్తూ ఉంటాను. ఒకరు ఏదో చెప్పారని అదే మనం చెయ్యాలని లేదు! ఒకరి మీద ఆధారపడడం ఒకరు చెప్పింది విని చేయడం నాకు నచ్చదు  మనంతట మనం  స్వతహాగా మనం ఆలోచించాలి

నీ మీద నీ టాలెంట్ మీద నీకు ఒక  స్టాండ్ అనేది నీకుండాలి నీ నమ్మకమూ నీ టాలెంట్ మీదే ఆధారపడి ఉండాలి అప్పుడే నీ జీవితానికి పరమావధి అవుతుంది  అప్పుడు నీ జీవితం బాగుంటుంది.అదే  నేను  నీకు చెప్పేది గుర్తుంచుకో అంది  అంతలో ఆంటీ అంటూ రజత వచ్చింది.ఏంటమ్మా రజిత బావున్నావా అంటూ పలకరించింది.విన్నీ ఉందా ఆంటి ఆ ఉందమ్మా లోనికి రా అలాగే అంటి  బాగా చదువుతున్నావా రజిత అవును ఆంటి హాయ్ విన్నీ రూమ్లోకి వెళ్లి మాట్లాడుకుందాం రా రజిత లోపలికి వెళ్ళగానే విన్నీపై పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏంటి రజిత ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ అడిగింది. చీలిక జ్యోతిష్యం వాడు చెప్పాడని నేను అరవిందును ప్రేమించాను నీప్రేమ సక్సెస్ అవుతుందన్నాడు.

కాని అతను చెప్పింది నిజం కాలేదు అరవింద్  నన్ను మోసంచేసి వెళ్లిపోయాడు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. రజిత ఏడుపు వినబడగానే అంజన వచ్చి ఏంటి ఏమైంది?ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ భయపడుతూ అడిగింది. ఏం లేదు ఆంటీ అంటూ కళ్ళు తుడుచుకుంది.ఏడుస్తూనే ఏం లేదంటావు ఏంటి  రజిత నిజం చెప్పు ఇంట్లో ఏమైనా గొడవలా అంటూ బుజ్జగిస్తూ నెమ్మదిగా అడిగింది.జరిగిన విషయాలన్నీ చెప్పింది.ఇంట్లో మీ అమ్మకు తెలుసా తెలియదు ఆంటి
ఇంత జరిగాక కూడ ఎందుకు చెప్పలేదు భయంవేసి చెప్పలేదు.ఆంటీ పిచ్చి పనులు చేసేటప్పుడు మాత్రం భయంలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు
మీ మమ్మీకి ఫోన్ చేసి చెప్తాను.

సరె ఆంటీ  రజిత వాళ్ల అమ్మకుఫోన్ చేసి సర్దిచెప్పింది రజితకు కూడ నాలుగు మంచి మాటలు చెప్పి సముదాయించి పంపించింది.
విన్నావా విన్నీ అందుకే అంటారు పెద్దలు చెప్పిన మాటలు వినాలని  సారి అమ్మ ఇంకోసారి మీ మాట జవదాటను అని నవ్వుతూ గట్టిగా ముద్దు పెట్టుకుంది. మా అమ్మ మంచిది అని.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!