దెయ్యం సలహ

దెయ్యం సలహ

రచన: యాంబాకం

     గండవరం అనే గ్రామం దాదాపు గా అడవి కి దగ్గర గా కొంచెం లోపలికి ఉంటుంది. ఆ గ్రామానికి అన్ని చదుపాయాలు లేక ఆ గ్రామ ప్రజలు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు.
అదే గ్రామంలో రాయుడు అనే రైతు వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయంలో వచ్చే ఆదాయం సరిపోవడం లేదని.చిన్న ,చిన్న, వ్యాపారాలు కూడ చేసి కలసి రాక నష్ట పోయి దిగులు తో చనిపోయాడు.కొంత కాలానికి రాయుడి భార్య కూడా చనిపోగ రాయుడు కొడుకు విజయ రాయుడు ని నానమ్మ చాకి పెద్ద చేసింది. అందరూ విజయరాయుడు ని ముద్దు గా విజయ అని పిలుచే వారు .ఇంటి బాధ్యతలు అన్ని విజయ మీద పడ్డాయీ కానీ విజయ బాధ్యత లేని మనిషి సోమరి,రాయుడు చనిపోయే నాటికి ఒక ఎకరం పొలం, ఉండే ఇల్లు మాత్రమే విజయకు మిగిలాయి.

అవ్వ ఎంత పోరాడిన పని బాట లేకుండా విజయ గ్రామంలో కాలిగా తిరుగుతూ కాలక్షేపం చేయసాగాడు.” తన మనవడు కనీసం పెళ్ళి చేస్తే అన్నా , బాధ్యతలు తెలుసు కొంటాడేమో! అన్న ఆలోచనతో విజయ అవ్వ అతనికి పెళ్ళి సంబంధాలు చూడ సాగింది”.

ఆ విషయం తెలియగానే విజయ అవ్వ తో విజయ మన పక్కింటి లో ఉండే పుల్లయ్య కూతురు గౌరి అంటే నాకు చాలా ఇష్టం అని అవ్వతో చెప్పాడు. గౌరి చాల చక్కగా ఉంటుంది.ఇంటి పనులు, అన్ని,చక్కగా చూసు కొంటుంది. మంచి పిల్ల నేను ముసలి దాన్ని,నీవూ అమ్మ నాన్న లేనివాడవు. “గౌరి అయితే నీకు ఈడు జోడు అని అవ్వ సంతోషంగా అంది”!

     ఒకరోజు అవ్వ మనవడు పుల్లయ్య ఇంటికి పోయి పిచ్చాపాటి గా మాటలు మొదలు పెట్టి “గౌరిని తన మనవడి కి ఇచ్చి పెళ్ళి చేయమని అడగ గా”! అమాటకు పుల్లయ్య ఇద్దరి మీద “విరుచుకుపడి”కోపంగా “సోమరి పోతుకు పెళ్ళి ఏమిటి”? ముందు నీ మనవడి కి బతుకు తెరువు చూసు కోమను. కనీసం ఉన్న ఆ పోలంనన్న సాగు చేయమని చెప్పడం పోయి!. “ఏకంగా పెళ్ళి సంబంధాలకే తయారు అయిపోయారా”?అంటూ గట్టిగా చీవాట్లు పెట్టాడు.

ఇది అంతా వంటింట్లో ఉన్న గౌరి విన్నది. అవమానం.  భారం తో ఇంటికి తిరిగి వచ్చిన విజయ కి రాత్రి నిద్రపట్టక అలోచించి అర్థరాత్రి అవ్వకి తెలియకుండా ఇంటి ప్రక్కనే వున్న అడవిలోకి పొసాగాడు.

     చీకటి పైగా కోపంతో ఉన్నాడు.అడవి మధ్యకి వచ్చే.  సాడు ఇంతలో ఆడవి గుబురు లో నుండి చెట్లు కదలడం తో విజయ కోపంలో నుంచి తేరుకొని భయపడి వణుకుతూ ఒక చెట్టు చాటుకు పోయి నిలబడ్డాడు.
కాసేపు తరువాత కొంచెం ధైర్యం తెచ్చుకొన్నవాడై, చిన్నగా తొంగి దొంగ లాగ చూడగా! “భీకరంగా ఉన్న తల్లి దెయ్యం ఒకటి పక్కనే రెండు మొగ దెయ్యాలు కీచులాడు కొంటూ కనపడ్డాయి, ఒక పిల్ల దెయ్యం కళ్ళమూసి “దాగుడు మూత దండా కోర్ అంటూ పాడగా” నాలుగు పిల్ల దెయ్యాలు దాక్కోడానికి చెట్లు చాటుకు పరుగులు తీశాయి.

    తల్లి దెయ్యం మొహం మీద నుంచి చేతులు తీయగానే పిల్ల దెయ్యం పరుగు పరుగు న పోయి దాక్కున్న  దెయ్యాల ను పట్టుకొనే పనిలో పడింది.

    మొగ దెయ్యాలు చెట్లు చాటున నక్కుతూ కొంత దూరం వచ్చి విజయ కంటబడగా”అమ్మోయ్”నరుడు  ,నరుడు అని అరుస్తూ, ఒరే “నరమాంసం తిని చాలా రోజులు అయిందిరా అనగా!మరో దెయ్యం అవునురో!  అంటూ పలకడం గమనించిన విజయ భయం తో కుప్పకూలి పొయినంత పని అయింది.

     వెంటనే దెయ్యాలన్ని పరుగు పరుగు న వచ్చి విజయ ని చుట్టూ చేరగా విజయ మరింతగా భీతి తో గొంతు బోంగపొయింది. మి…మి..మీరు నిజంగా… దె.. దె.. దెయ్యాలా మంచి దెయ్యాల చెడ్డ దెయ్యాల అని ప్రశ్నించాడు.

     తల్లి దెయ్యం విజయ వైపు”ఆశ్చర్యంగా!చూసి పిల్ల దెయ్యాలని హెచరించి నరులు బలవంతులు మీరు దూరంగా పోయి ఆడుకోమనిచెప్పి” గంభీర కంఠం తో “ఇలా అంది పిశాచాలు,దెయ్యాలు  తిరిగే జాము లో మానవులకు అది అడవి మధ్యకు రావడానికి నీ కెంత ధైర్యం “! అని “సరే ఎందుకు వచ్చవో నీకు బతకాలన్న ఆశపోయి వచ్చినట్లు గా ఉంది ఇంక కాసేపు ఇక్కడే ఉన్నావా అదిగో మొగ దెయ్యాలునిన్ను కర కర నమిలి విందు చేసుకొంటారు ఇంటిల్లిపాది అట్టూ! “అడవిలోకి ఎందుకు వచ్చావో చెప్పు లేదా మాలా దెయ్యం ఐయి ఇక్కడే మాతో గడపవలసి వస్తుంది”ఆంది. తల్లి దెయ్యం మరలా మరలా!

ఇంతలో ఒక పిల్ల దెయ్యం బాగా ఆకలి గా ఉంది అమ్మ అని వాటి భాషలో మారాం చేయడం మొదలు పెట్టగా తల్లి దెయ్యం ఏదో చెప్ప బోతుండగా, అప్పడే ఒక మొగ దెయ్యం తల్లి దెయ్యానికి దగ్గర గా చేరి పీల గొంతు తో వీడు మనకు,మనము వీడికి, కనిపిస్తున్నా మంటే, వీడు ఎదు కాళ్ల తో పుట్టే ఉంటాడు. ఎదురు కాళ్ల తో పుట్టిన వారు కనపడితే వాడి జోలికి పోకండి అని మన నాయకుడు చెప్పేడుకదా! వాడిని వదిలే లేదా మనం చస్తాం. అని మెల్లగా చెప్పడం విజయ గమనించాడు.

     ఆ మాటలతో విజయ ధైర్యం తెచ్చుకొని నేను ఎదురు కాళ్ళ తోనే పుట్టానంట!  మా అవ్వ పదె పదే గుర్తుచేస్తూ ఉంటుంది.అని చెప్పగానే దెయ్యాలు అన్ని భయపడి బాబు బాబూ నీకు పుణ్యం ఉంటుంది నీకు సహాయం చేస్తాము మమ్మల్ని వదిలే అని బతిమాలాయి దెయ్యాలు!నిదానంగా!

     కాసేపు తరువాత ఒక మొగ దెయ్యం,తల్లి దెయ్యం విజయను గుర్తు పట్టినదై అడవిలో ఈ అర్థరాత్రి ఎందుకు వచ్చావు నాయన!  అని ప్రేమగా అడిగారు.విజయ మీరు చాలా ప్రేమగా పలకరిస్తున్నారు. నేను అదిగో ఆ పక్కనే ఉన్న గ్రామం లో నే ఉంటాను మాఅమ్మ నాన చనిపోగా మాఅవ్వ నన్ను చాకింది నాది పేద కుటుంబం అని తన పరిస్థితి గురించి దెయ్యాలకు ముందుగా చెప్పి.తరువాత గౌరి ని పెళ్ళాడతానంటే కొబోయ్యే మామ పుల్లయ్య చేసిన అవ మానం వివరించి కన్నీలు పెట్టు కొని “నేను ధనవంతున్ని అయివుంటే. ఆ పుల్లయ్య ఇలా మాట్లాడే వాడా? గౌరి నా భార్య కాకపోతే నేను బతకడం ఎందుకు?ప్రాణం మీద ఆశవదులుకునే. అడవికి వచ్చాను”అన్నాడు.విజయ పుట్టేడు దుఖం ఆపుకొంటూ!.

      దయ్యాలు విజయ కేసి కళ్ళు కదపు తూ వెట్టకారంగా “ఓస్, దీనికేనా!. అయితే నీకు డబ్బులు ఇస్తే నీ సమస్య తీరుతుందా. అంటూ!. ఆ పక్కనే ఉన్న చెట్టు తొర్రలో చేయిపెట్టి ఒక తోలు సంచిని బయటకు తీసి విజయ చేతిలో పెట్టి ఇందులో చాల బంగారు కాసులు ఉన్నాయి తీసుకొని పోయి గౌరిని పెళ్లి చేసుకో! మరోసారి ఇలాంటి పనులు చేయకు అంది తల్లి దెయ్యం .

     విజయ దెయ్యాలకు వంగి దన్నం పెట్టి తోలుసంచి తో ఇంటి దారి పట్టాడు. విజయ గ్రామం చేరేసరికి తెల్లవారి పోయింది.

     అతడు నేరుగా పుల్లయ్య ఇంటికి పోయి బంగారు కాసులు ఉన్న తోలుసంచి ని పుల్లయ్య చేతిలో వుంచి ఇదిగో నాకు ఏమీ లేదు అని అవమానించావు “ఇందులో బంగారం కాసులు కొల్లగా ఉన్నాయి. తీసుకొని నాకు గౌరికి   పెళ్ళి చేయి. ఇంకా నీ అభ్యంతరాలు ఏమిటో చెప్పు” అన్నాడు. పుల్లయ్య ఆశ్చర్య పోతూ తోలుసంచిని తెరచి చూడగా! అందులో నుండి ఆ మరుక్షణం తుస్ అంటూ గాలి బయటికి వచ్చింది. ఇందులో ఏముంది ఈ తోలు సంచిలో గాలి తప్ప బంగారు కాసులు అన్నావ్. చీ, చీ,! అంటూ పుల్లయ్య తోలు సంచిని దూరంగా విసిరి కొట్టాడు.

     విజయ నిర్ఘాతపోతూ సంచిని చేతికి తీసుకుని, లోపలికి చూశాడు. అందులో బంగారం కాసులు కనబడలేదు.

“ఏమిటి మాయ! ఈ సంచిలో నిండా దెయ్యం బంగారం కాసులు పోయడం నా కళ్ళతో నే చూసానే”అంటూ విజయ దిగులు ముఖం పెట్టాడు.

     పుల్లయ్య “అబద్ధం చెప్పినా అతికినట్లుండాలి పద పద అవతలనాకు బోలెడంతపని”!అంటూ విజయ. ను మరోసారి చీదరించుకొన్నడు.

     గౌరి తలుపు వార గా నిలబడి యిదంతా చూస్తూ నే వున్నది.విజయ గట్టిగా తల బాదుకోని “దయ్యాలు అయితే మాత్రం మరీ ఇంతగా పచ్చి మోసం చేస్తాయా.? ఈ రాత్రికే అడవికి పోయి జుట్టు పట్టుకొని నిలదీసి అడుగు తాను”.అంటూ ఇంటికి వెళ్ళాడు.

ఆ రాత్రి విజయ నిద్ర పొక  దెయ్యాల స్థావరానికి పొయాడు. అప్పుడు తల్లి దెయ్యం మొగ దెయ్యం విజయ ని చూసి సంతోషంగా కనిపించాయి. ! విజయ కోపంగా తల్లి దెయ్యం దగ్గర కుపోయి. “నువ్వు పచ్చి మోసకారివి!బంగారు కాసులు అని చెప్పి సంచిలో యింత గాలి ఊదియిస్తావా”? అన్నాడు.

     తల్లి దెయ్యం వచ్చే నవ్వు అపుకుంటూ ” నీకు తెలివి రావాలనే కష్టం అంటే ఏమిటో తెలియాలనే ఏదుటివారి మనసుతెలుసుకోవాలనే అలా చేసాను.

     కోపంలో రాత్రి నీవు ఆత్మహత్య కు పాల్పడేందుకు ఈ అడవికి వచ్చావు.  ఆవేశం తగ్గంచేందుకే నీకు ఉత్తుత్తి బంగారం కాసులు బహుకరించాను.చచ్చి. సాధించేది ఏమి వుండదు.  విజయరాయుడు అంది.వెంటనే విజయ నా పూర్తి పేరు నీకు ఎలాతెలుసు అనగా,పక్కనే వున్న మొగ దెయ్యం ఇంకా గుర్తు పట్ట లేదా విజయ మేము మీ అమ్మ నాన్న  లం నీ బాగోగులు చూడకుండా చనిపోయి కోరిక తీరక ఇదిగో ఇలా దెయ్యాలతో దెయ్యాలై బతుకు తున్నాము.   నీవు కోరికలు తీరక చనిపోతే మాల దెయ్యం బతుకు తప్ప ఏముంది.  ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇంటికి తిరిగి పోయి.ఉన్న మన పొలం తోడుగా పుల్లయ్య పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయంచేసుకొంటూహాయిగా బతుకు. భర్త ఏ సోమరి
పోతో, లేక దెయ్యాలు, భూతాలు నుంచి డబ్బు,బంగారు, తెచ్చే వాడు కాక,కష్టపడి సంపాయించే వాడు అయితే నే భార్య గౌరవంగా చూసు కుంటుంది. నీవు బాగవుంటే మాకోరిక తీరిపోతుంది అప్పుడు మా ఆత్మలు శాంతించి. మాకు దెయ్యాల రూపాలు పోయి వేరే లోకనికి వెళ్లి పోతాము అని” “దెయ్యం సలహ” ఇచ్చింది.

ఆ మాటల విజయ కి తాను ఇంత కాలం గా గడిపిన జీవితం పట్ల అసహ్యం కలిగింది. అతడు తన కళ్ళు తెరిపించిన దెయ్యానికి కృతజ్ఞతా భావం తో నమస్కరించగా దెయ్యాలు కాస్త మాయమైపోయాయి.

     విజయ వెంటనే అక్కడినుంచి కదలి ఇల్లు చేరిసరికి వాకిట్లో నిలబడివున్న గౌరి “బంగారం కాసులు కోసం యింత అర్థరాత్రి దెయ్యాల దగ్గర కు వెళ్ళావన్న మాట” అన్నది.

విజయ ఉలిక్కిపడి అదంతాగతం ఈరోజు నుంచి ఒళ్ళోంచి కష్ట పడి వ్యవసాయ సేద్యం చెస్తా అన్నాడు.

   గౌరి ఎదో అనబోతుండగా, పుల్లయ్య బయటికి వస్తూ. “ఈ మాత్రం బుద్ధి నీకు లోగడవుంటే నా కూతురిని నీ మనవుడి కి చేసుకోమని,మీ అవ్వ దగ్గర కు ఏనాడో వచ్చి వుండే వాన్ని!అన్నాడు.

పుల్లయ్య మాటలకు విజయ,గౌరి,అవ్వలతో పాటు పైనుంచి పరలోకం లో ఉన్న విజయ అమ్మ నాన్న పరమానందం చెందారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!