మానవనైజం

మానవనైజం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: యువశ్రీ బీర

పుట్టిన ప్రతివ్యక్తి చితికిచేరేవరకు.
చిత్రమైన ఆలోచనలతో.
తనతో తాను యుద్ధంచేస్తూ.
తనను తాను నిరూపించుకోవడానికి.
చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
వ్యక్తిగా అది ఒక బాధ్యతనే చెప్పాలి
కానీ స్వార్ధం నింపిన హృదయం
నిస్వార్ధాన్ని మచ్చుకైనా కనపడనీయడంలేదు
అందుకే నా అనే భావన
మనిషిని దూరతీరాలకు తీసుకెళ్లి
ఎటువైపైనా విసిరేస్తుంది అది మంచే కావచ్చు…చెడైనా.!
నేను సాధించలేనిది ఎదుటివారెలా సాధించారని.
అక్కడేదో జరుగుతుందని దాన్ని తెలుసుకోవాలని.
ఇక్కడేవో ముచ్చట్లు మురిపిస్తున్నాయ్.
ఆస్వాదించాలనే కుతూహలం.
ఇన్నిరోజులూ వారి చేతిలో డబ్బే ఉండేదికాదు.
కానీ.! ఇప్పుడు వారెలా ఎదిగిపోయారని.
తెలుసుకోవాలనే ఆరాటం.
ఎదుటివారికంటే మేమేమీ తీసిపోలేదంటూ.
తనకున్న ఉనికిని కాపాడుకోవాలని.
తపనల దారిలో పరిగెడుతూ.
పడిలేస్తూ తన జీవనయాత్రలో.
తుదిశ్వాస విడిచే వరకు ఆరాటపడుతూ.
బతుకు బండిని ఈడ్చుకెళ్లే
ఇజం మానవ నైజం.

You May Also Like

One thought on “మానవనైజం

  1. ఊపిరికి ఉరి పేరుతో మీరు రాసిన ఇప్పుడే చదివాను మేడం. స్త్రీ యొక్క గొప్పతనాన్ని నిజంగా చాలా బాగా వ్యక్తం చేశారు కవిత లో అభినందనలు మేడం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!