మౌనసాక్షి

అంశం: మనస్సాక్షి

మౌనసాక్షి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: మక్కువ. అరుణకుమారి

అంతరాలు అంతమవ్వాలని
కట్టుబాట్లును తగులబెట్టాలని
అందమైన ఆదర్శాలు వల్లిస్తారు కొందరు
ఆచరణలో పెట్టేందుకు, మాత్రం ముందుకు రారు ఎవ్వరు
మనస్సాక్షిని నొక్కిపెట్టి, ఆదర్శాలను
అణిచిపెట్టేవారే అందరు
అలరించే మోదమైనా అణిచిపెట్టిన ఖేదమైనా
సిరి సంపదలెన్నున్నా అసలేమీ లేకున్నా
మనస్సాక్షికి అనుగుణంగా నడిచినపుడే
మనిషి మనుగడ మోదమన్నా
అది లేనిదే బతుకు ఎంతో శూన్యమన్నా!
తప్పుచేసే వేళ హెచ్చరిస్తుంది
ఒప్పుచేసే వేళ మెచ్చుకుంటుంది
సంశయించేవేళ బుజ్జగిస్తుంది
పదుగురెళ్ళే బాట నడవమంటుంది
ఎవరున్నా, లేకున్నా మౌనసాక్షి నేనంటుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!