ఎండమావులు

అంశం: అందమైన అబద్ధం

ఎండమావులు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: వనపర్తి గంగాధర్

నేను ఆనందంగా ఉన్నాను
నేను సంతోషంగా ఉన్నాను
ప్రతి మనసు ఘోషకు తెలుసు
ఇది అందమైన అబద్ధమని

ఇది ప్రజాస్వామ్యమని
ఇది ప్రజారాజ్యమని
ఇది సమ సమాజమని
ప్రతి గుండె బాధకు తెలుసు
ఇది అందమైన అబద్ధమని

ప్రతి పేదవాన్ని దనికుణ్ణి చేస్తాము
ప్రతి ఇంటికి ఉద్యోగమిస్తాము
అవినీతి రహిత సమాజ నిర్మాణం చేస్తాము
నాయకుని కపట హృదికి తెలుసు
ఇది అందమైన అబద్ధమని

నువ్వు లేక నేను లేను
నీ తోటిదే నా జీవితం
నీ కోసమే నేను జీవిస్తున్నాను
దుష్ట ప్రేమికుడి ఎద గూటికి తెలుసు
ఇది అందమైన అబద్ధమని.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!