అందమైన అబద్ధం

అంశం: అందమైన అబద్ధం

అందమైన అబద్ధం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పరిమళ కళ్యాణ్

చందమామ రావే అంటూ
చందమామని చూపిస్తూ
గోరుముద్దలు తినిపిస్తుంది అమ్మ
అది ఎంత అందమైన అబద్ధం!

తినటానికి వాళ్ళకి భోజనం
మిగలకపోయినా మనకోసం
తిన్నామని కడుపు నిండిందని
చెప్పటం అందమైన అబద్ధమే కదా!

అది నిజం కాకపోయినా
ఒకరిని బాధ పెట్టకుండా
సంతోషపరిచేది అయితే
అబద్ధం అయినా ఆనందమే!

అబద్ధం అందమైనది
చూడటానికి ఎంతో బాగుంటుంది
కానీ నిజం చేదుగా ఉన్నా
ఎప్పటికైనా అదే గెలుస్తుంది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!