జతపడు హృదయం

జతపడు హృదయం

రచన::జయకుమారి

Jayaమబ్బులు చాటున దాగిన నెలవంక
ఎందుకో శోక సంద్రమై ఉంది.
కష్టాలు తీరే తీరం తెలియక
మసకబారిన కన్నులతో
మౌనంగా రోదిస్తూ..
గమ్యం తెలియని బాటసారి గా
తనని తాను వెలివేసుకొని.
ప్రపంచమే తనని వెలివేసింది
అనే భ్రమ లో
ఈ సిరి గల లోకంలో
తను ఒంటరిగా మిగిలి పోయినని విలపిస్తుంది.
కానీ తనని ప్రాణం గా చూసుకొనే
హృదయాలు ఇంకా మిగిలే ఉన్నాయి అని
ఎలా తెలిపేది.
ఎలా ఓదార్పు ఇచ్చేది.
ఓ చంద్రమా..
నీ నీడ గా నీ వెన్నెంటి ఉండే నీ చెలి
జతపడు హృదయమై నీ ఊహల జగతిని
నిండు పున్నమిలా మురిపిస్తు
నీ లోకాన్ని ప్రేమ మాయం చేస్తు నీ బంధమై
నీలో ఐక్యం అయ్యిపోతుంది అని ఆశ తో ఎదురుచూడు నేస్తం.

***

You May Also Like

One thought on “జతపడు హృదయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!