నాకై..నాలో నేను

నాకై..నాలో నేను

రచన:: సత్య కామఋషి ‘రుద్ర

Sathya

నాలోని నా జాడ కోసమని
నాలోని అణువణువులోనూ
ఎంత తరచీ తరచి వెదికినా…
కానరాలేదు.. ఏమై పోయానో..!

నాతోటి నా చెలిమి పంచిన
మధురానుభూతుల కోసం..
ఎంత వెతికి వెతికి చూసినా…
ఏమన్ని దొరకలేదు కోకొల్లలుగా,
ఏ ఆనవాళ్ళ జాడైనా లేదేమిటో..!

లోకాన్ని మరచి ఆదమరపుగా
ఆనందాన తేలియాడిన కాసిన్ని
క్షణాల కోసమో ఘడియల కోసమో
గతాన్ని తవ్వి చూసుకున్నానా..అవి
నింగిన తళుకులీను తారకలోలే,
అక్కడొకటిగా…అప్పడొకటిగా…
మిణుకు మిణుకు మన్నాయేమనో…

నాలోని నేను కనిపించక కనుమరుగై,
నాతో నా చెలిమి కొనసాగక తెరమరుగై,
నేను నేనుగాకాక, నాకు నేను లేనేలేక ,

కాలపు గమనంలో కలగలిసిపోయి.,

తేరుకోలేక, చెరగని ఙ్ఞాపకాన్నై మిగిలి
తిరిగి రాలేక, రేపటి మనుగడకై సాగించే
ఎడతెగని, తీరెరుగని పరుగులోన అలసి
ఆగలేక, అట సాగలేక, ఈ గతిన నిలచి,
ఎన్నినాళ్ళు గడిచెనో గురుతేరాదేమిటో.!

***

You May Also Like

One thought on “నాకై..నాలో నేను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!