కవనోన్ముఖం- అక్షరక్రమ కవిత(న్యస్తాక్షరి)
మక్కువ. అరుణకుమారి
అ స మాన ప్రభలతో అలరారు
ది వ సేంద్రుని కని
ప ర వశ పులకాంకితయై
క్ష ణ క్షణమునకు ఆ పద్మిని
ర వి కిరణ కాంతుల
అ వ లోకితయై
అ ర విచ్చుకున్నది
క ణ కణములు ఉప్పొంగగా!
ఆ పూ ర్ణ చంద్రుని
శ ర చ్ఛంద్రికలనెడి
బా ణ సంచయంచే వెల్వడిన
సు ధా రసామృత పానం చేయుచూ
స ర స హృదయాంబుధ
వీ ణ లు మీటుచూ కలువ
కు సు మ భామలు విరిసి
సు ధ లు కురిపించాయి మది మదిన
కవనోన్ముఖం చేయుచూ