బంధం
రచన:: జయ
మనస్సును వేధించే జావాబు లేని ప్రశ్న లు
చుట్టూ రంగులరాట్నం మేనా జీవితం.!
ఏవేవో ప్రశ్నలు,
మనస్సును సొంధించ మని వేధిస్తున్న ప్రశ్నవళి ఏమిటో.
మనస్సుకు మనస్సు తోడు కావాలా.!
మనిషికి మనిషి తోడు కావాలా.!
లేక మనిషికి డబ్బు తోడు కావాలా.!
ఏమో కదా.!
అస్సలు ప్రతి మనిషికి కొన్ని బంధాలు ఉంటాయి.
బంధం అనేది బంధుత్వమే అయ్యివుండలా.
రక్తసంబంధమే అయ్యి ఉండలా.!
మనస్సుకీ బంధం వుండకూడదా.!
బంధాలు అనేవి అవసరాల కోసమే అంటారు కొందరు.
మరి ఎందుకు ?
కొన్ని బంధాలు మనలో ఎక్కడా దొరకని సంతోషాన్ని ఇస్తాయి.
కొన్ని బంధాలు దూరం అయితే వారితో పాటే
మన ప్రాణం,మన సర్వస్వం పొయినంత బాధ వస్తుంది.
ఎందుకో తెలియదు కదా.!
అస్సలు బంధాలకి పేర్లు ఉన్నాయా.
పేర్లు ఉన్న బంధమే నిజమైన బంధమా.!
వాటితోనే మన జీవితాలు మన సంతోషాలు
ముడిపడి ఉన్నాయా.!
మనం ఏ బంధం లో అయితే ప్రేమ ను పొందుతామో.!
ఏ బంధం లో అయితే మనం భద్రంగా ఉంటాము అనే ధైర్యం గా వుంటామో.
ఏ బంధంలోస్వేచ్చ గా వుంటామో.
ఏ బంధంలో అయితే సంతోషంగా ఉంటామో.
ఏ బంధం లో అయితే చిన్నపిల్లలా అల్లరి చేస్తామో.
ఆ బంధం మన మనస్సుకీ జత కలిసి మన చివరి వరకు తోడు ఉంటుంది.
అదే నిజమైన బంధం అవుతుంది.
ఆ బంధానికి పేరు లేకపోయినా మన అనుబంధం అవుతుంది.
అది ఎందుకు తెలుసుకోదో ఈ లోకం.
******