వీరనారి

వీరనారి

రచన::సుజాత

నువ్వు లేని జీవితం ఎలా ఊహించుకోను

నువ్వు లేని జీవితం ఎండమావెే నువ్వే

నా జీవితం అనుకుంటూ నీ భ్రమలో బతికాను

నువ్వే వెలుగువెై నన్ను ముందుకు నడిపించావు

విషాన్ని వెదజల్లుతూ నీ పాటికి నువ్వు వెళ్లావు

మరణిస్తూ వెలుగునిచ్చే ప్రమిద వయ్యావు

మళ్లీ నాలో ఆశలు చిగురింప చేశావ్

నా ప్రయాణం ఎటో అర్థం కావడం లేదు

అప్పుడు ఏంటో నీ మాటలు అర్ధంకాలేదు

నీ చేతలలో చూపించావు త్యాగాలు

ఏమీ తెలియని నాకు నిప్పుకణికలా మార్చావు

చల్లని నీ చూపులతో ఆత్మ విశ్వాసాన్ని కల్పించావు

భారమనుకున్న నా జీవితాన్ని మళ్లీ జీవించేలా చేశావు

నువ్వు చేసిన త్యాగం దేశం గర్వించేలా చేశావు

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్

అనే జీవనవిధానాన్ని నేర్పావు నీవు చేసిన దేశ సేవ

ఎన్నటికీ మర్చిపోలేనిదిగా వీరమరణం పొందావు

నీవు కన్నబిడ్డలను దేశం గర్వించేలా చేస్తాను

ఇదే నీకిచ్చే హామీ నా జీవితం నీకే అంకితం

వీరమరణం పొందిన వీర జవాన్లకు జైహింద్

నీవే నాకు స్ఫూర్తి నీకు నా జోహార్లు✍️ 🙏

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!