సేవా సామరస్యం

సేవా సామరస్యం

రచన::బొప్పెన వెంకటేశ్

సేవా సమరసత సంఘ సద్భావన సమాహారంతో బడుగుల బాగుకై బంగారు బాటలు వేయాలి

కుల మత జాడ్యపు జాతి వైరాల కుటిల వ్యవస్థను పారదర్శకతతో ప్రక్షాళన గావించాలి

పచ్చ నోట్ల మెట్లపై అందలమెక్కిన వైద్యం పేదోడి జేబుకి దగ్గరవ్వాలి

అటకెక్కిన విద్యను అనగారిన జనం చెంత ప్రతిష్టించి పేదవారి వాకిట్లో విద్యాకుసుమాలు వికసింప చేయాలి

బోసిపోయిన బీదవాడి బ్రతుకుల తారతమ్యాలను పాత బావిలో పాతరేయాలి

కూడు గుడ్డ లేని గుడ్డిదైన దీనుల జీవితంలో నాలుగు రాళ్లను అందించే రవికిరణాలు ఉదయించాలి

ఎండిపోయిన గుండె గూటిలో పచ్చని ఆశల ఇంటిని చిగురింప చేయాలి

సమసిపోయిన సామాజిక గౌరవ జాగృతి గీతాన్ని గొంతెత్తి చాటాలి

అసమానత్వపు పెలుసులను తొలిచి సమరసత సిద్ధికి సమిష్టిగా సమారోహించి సమ సువర్ణాలు పూయాలి

అడుగంటిన సామాజిక న్యాయ అలలు అభ్యుదయ అంబరాన్ని మీటాలి సమసమాజ న్యాయానికి సంఘటితం అవ్వాలి

ఫలితంగా జనించిన ఆ సామాజిక భద్రతా వెలుగులు ప్రపంచమంతా పరావర్తనం చెంది ధైర్య ప్రతిబింబం పొందాలి

మనుషులంతా ఐకమత్యపు సేవ నావలో నవ సమసమాజ నిర్మాణ అలల కాంతులీనుతూ దేదీప్యమానం కావాలి

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!