ఒకరికై ఒకరు

 ఒకరికై ఒకరు

రచయిత : సోంపాక సీత

ఒకరితో ఒకరు కదలిన
ఒకరికై ఒకరు నిలచిన
ఒకరికై ఒకరు మిగిలిన
కాలపు కొలిమిలో కరుగును
ఖేదాలన్నీ,
మనోసంద్రంలో తొలగును
భయాలన్నీ,
మమతల కొలనుగ విరియును
బంధాలన్నీ,
బీడుభూముల్లో పల్లవించును
బ్రతుకు రాగాలన్నీ…
అందుకే ఉందాం అందరం!
ఒకటిని కలిపే ఒకటిగా…!!

ఒకటిని ఓరిమితో కలుపుకుంటూ వుంటే….!?
దిగులు దుప్పట్లు తొలగిపోతూ
పలుకుల ప్రభాతభేరీలు మ్రోగునుగా..!
ఉప్పుమేటల దైన్యాలన్నీ
దిగులుబండ్లు దిగి
ఆశల తెరచాపలు ఎగురవేయునుగా..!
నడిచే దారులన్ని వెంటనడిచే
మానవతా కాంతులు చిమ్ముతూ,
మనిషి విలువ పెంచుతూ…!

You May Also Like

One thought on “ఒకరికై ఒకరు

  1. మీ కవితా పలుకుల ప్రభాత భేరీలు 👌👌💐💐
    సీత గారూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!