అరణ్య పురాణం

అరణ్య పురాణం

రచయిత:జయసుధ కోసూరి

అన్యాయాలు, అసమానతలు లేని
కొత్త లోకమొకటి సృష్టించబడాలి.
గతపు గాయాలకు సంతోషపు పుప్పొడిని అద్దాలి.
రాయబడని ఓ నెత్తుటి కావ్యం
మరణపు అంచున సీతాకోక చిలకై ఎగరాలి.
రాతిరికి రాలిపడ్డ చుక్కలు
దహిస్తున్న దేహానికి ఔషదపు లేపనం
పూయాలి.

నాకో ప్రేరణ కావాలి.
తెగిపడ్డ శవాలసాక్షిగా
ఓ నెత్తుటి గేయం రాయడానికి..!
సమాజపు స్వార్ధపు శకలాల కింద
నలిగిన నీతి శిలా ఫలకాలకే అంకితమౌతుంటే..

చచ్చిన మేధావుల సమాధుల సాక్షిగా
చెప్తున్నా..
రాబోవు నీతి సమాజానికి వారధి నౌతానని.
అలసిన అమ్మమ్మ కథలు అరణ్య పురాణాన్ని చెప్పాలని.
ఎదురు చూస్తున్నా…
ఎదిగున్నోడి అన్యాయం
ఒదిగున్నోడి ఆయువు తియ్యగూడదని.
రాబోవు రోజులు రామరాజ్యం కావాలని.

You May Also Like

One thought on “అరణ్య పురాణం

  1. చాలా బాగా వ్రాసావు చెల్లీ👌👌💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!