పడిలేచిన కెరటం

పడిలేచిన కెరటం

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

“ఓరేయ్!రాఘవా!ఇది విన్నావా?శేఖర్ చనిపోయాడు నిన్న రాత్రి. ఇప్పుడే వాళ్ళ పక్కింటి వాళ్ళబ్బాయి ఫోను చేసి చెప్పాడు. మీ స్నేహితులందరికి చెప్పమని” శ్రీధర్ ఫోను చేసి అందరికి చెప్పాడు.
“స్వయంకృతం.ఏంచేస్తాం? ఎవరుచేసుకున్నదానికి వాళ్ళు అనుభవించాల్సిందే కదా!”మరోస్నేహితుడి
ఉవాచ.
“ఎవరు ఎంత చెప్పినా విన్నాడా మహనుభావుడు. తన జీవితాన్నీ జేచేతులా పాడుచేసుకున్నాడు. తను ఎలాగూ పోయాడు సరే భార్యని కొడుకుని కూడా అన్యాయం చేసిపోయాడు.”మరొకరి తీర్పు. ఇలా ప్రతిఒక్కరూ శేఖర్ గురించి వ్యక్తం చేస్తున్న
అభిప్రాయాలు.
అవును నిజమే!శేఖర్ తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు.శేఖర్ జీవితాన్ని రెండు భాగాలుగా విభజించాల్సి చూడాలి. పెళ్ళికి ముందు పెళ్ళికి తరువాత.
పెళ్ళికి ముందు శేఖర్ చాలా విలాసవుతంగా గడిపాడనే చెప్పాలి. ఎప్పుడు స్నేహితులు స్నేహితులతో విందులు. అలాగని తనేం డబ్బుగలవాడుకాదు. శేఖర్ డిగ్రీ ఆఖరి సంవత్సరంలోనే తండ్రి చనిపోయాడు. తండ్రి ప్రభుత్వాసుపత్రిలో నాల్గవతరగతి ఉద్యోగి. కుటుంబ భాధ్యతలు శేఖర్ మీదే పడ్డాయి. పెళ్ళికి అక్క వుంది. తమ్ముడి చదువు . డిగ్రీ పూర్తిచేసి ఐ ఎ ఏస్ చేయాలనుకున్నాడు. కాని ఉద్యోగంలొ ఉండగా తండ్రి చనిపోవడంతో ఆ ఉద్యోగం శేఖర్ కి ఇచ్చారు. అతని ఆశలసౌధం కూలిపోయింది. ఆ ఉద్యోగం చేస్తూ ఒకొక్క బాధ్యతలని పూర్తిచేసాడు. అక్క పెళ్ళి చేసేశాడు. తమ్ముడు చదువు పూర్తయ్యి అతనికి ఉద్యోగం కూడా వచ్చేసింది. ఇక శేఖర్ ని పెళ్ళిచేసుకోమని స్నేహితులు బంధువులు ఒత్తిడి చేశారు. ఇక పెళ్ళి చేసుకోక తప్పలేదు శేఖర్.
పెళ్ళి తరువాత శేఖర్ జీవితం చాలా మార్పులు చెందింది. భార్య అందగత్తే. ఒక రెండు సంవత్సారాలు వారి జీవితం సుఖమయంగా సాగి వుంటుందేమో. దాని ఫలితంగా ఒక కొడుకు పుట్టాడు. ఇక ఆనందంగా గడపాల్సిన జీవితమే. కాని భార్యపై అనుమానం ఎక్కువకాసాగింది. ఆమెను రకరకాలుగా హింసించడం ఆరంభించాడు. కొడుకంటే మాత్రం అతి ప్రేమగా చూసుకొనేవాడు. మళ్ళీ తన పూర్వపు జీవితానికి అలవాటుపడ్డాడు. స్నేహితులతో తిరుగుళ్ళు విందులు
వినోదాలెక్కువయ్యాయి. అలాగే భార్యపై సాధింపులు హింసలు కూడా పెరగసాగేయి. ఇక ఆమె చదువుకున్నది కావడంతో కొడుకుని తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. శేఖర్ ఇక స్వేచ్ఛాజీవే. అడిగేవారులేరు. చెప్పేవారులేరు. ఉద్యోగంలో కూడా చెడ్డ పేరే తెచ్చుకున్నాడు. త్రాగుడుకు బానిసయ్యాడు. గుట్కా ఖైనిలు అలవాటుచేసుకున్నాడు. విచ్చలవిడితనం ఎక్కువైంది. ఇక ఆరోగ్యం ఎలా బాగుంటుంది ? కేన్సరు బారిన పడ్డాడు. అది పీల్చి పిప్పిచేసేసింది. చివరికి చనిపోయాడు. శేఖర్ చరిత్ర ముగిసిపోయింది. శేఖర్ భార్యకి శేఖర్ ఉద్యోగం దొరికింది. కొడుకుని బాగా చదివించింది. శేఖర్ కమ్ముల తనతో ప్రేమగా మసులుకున్నప్పుడు తాను ఐ ఎఎస్స్ కావాలని ఉండేదని చెప్పెవాడు. కొడుకుని ఐఎఎస్స్ ని చేసింది.
శేఖర్ ఆశలసౌధాన్ని తిరిగి నిలబెట్టింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!