ఒక చిన్న ఆశ

ఒక చిన్న ఆశ

రచయిత :: శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి

మొక్కనై మురిపెంగా మురవాలనీ పూవునై పరిమళాన్ని విరజిమ్మాలనీ ,

చెట్టునై మధుర ఫలాలను అందించాలనీ,
కోకిలనై కుహు కుహు రాగాలు ఆలపించాలనీ
చిలుకనై కిలకిల రావాలు పలకాలనీ,

జలపాతమునై జల జలా జారాలనీ , నదినై హొయలొలుకుతూ ఉరకలెయ్యాలనీ,

మత్స్యమునై నీటిలో ఈదాలనీ, మయూరమై పురివిప్పి నాట్యమాడాలనీ,

చెవుల పిల్లినై చెంగు చెంగుమని గంతులెయ్యాలనీ,
కోతిపిల్లనై ప్రతీ కొమ్మనీ పలకరించాలనీ,

విమానమై గగనంలో విహరించాలనీ , రాకెట్టునై చుక్కల లోకాన్ని చుట్టేయాలనీ ,

సూర్యుడినై నులివెచ్చని కిరణాలతో స్వాగతం పలకాలనీ,
చంద్రుడినై చల్లని కౌముదిని పంచిపెట్టాలనీ,

హరివిల్లునై ఆకాశంలో మెరవాలనీ,
పర్యావరణమునై ప్రతీ దినం ప్రకృతి ఒడిలో పరవశించాలనీ
నాలో “” ఒక చిన్న ఆశ “”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!