చిన్న కోరిక

చిన్న కోరిక

రచయిత :: జి.ఎల్.ఎన్.శాస్త్రి

నీ
కాటుక కంట
చిన్ని
బిందువునైనా
చాలు,
అమావాస్య కూడా
వెన్నెలైపోతుంది.
చెలీ..

నీ
జడ కొప్పులో
మల్లెనయి
ఒక రేయి
గడిపినా..
ఈ జన్మ ధన్యమే
చెలి…..

నీ
కాలి అందియనై
ఒక్కసారి
ఘల్లుమన్న చాలు,
సప్త స్వరాలకు
నేను స్వరకర్తనైపోతాను,

నీ
మదిలో
ఒక క్షణమైనా,
నా రూపముంటే
చాలు ..
ఎన్నో విజయ పరంపరలు
నా సొంతమైపోతాయి,

నీ
హ్రదయంలో.
కవాటంలో
బంధించు..
మరెన్నడు
నిన్ను
తలుపు
తెరవమని అడుగను

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!