ఆశ దోశ

ఆశ దోశ

రచన: సంజన కృతజ్ఞ

అనగనగా ఒక ఊర్లో భీమయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి శ్రీమంతుడు అవ్వాలనే కోరిక చాలా ఎక్కువ. ఎప్పుడు తను శ్రీమంతుడు కావాలనే కలలు కనేవాడు. అతను అడవిలో కట్టెలు కొట్టి పక్క ఊరిలో అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఓ రోజు అతను తన కట్టెలను పక్క ఊరిలో పాల వ్యాపారం చేసే సుబ్బమ్మకు అమ్మాడు ఆమె అతనికి డబ్బులకు బదులు ఓ కడివెడు పాలు పోసింది. అవి తీసుకొని అడవి నుండి బయలుదేరాడు. భీమయ్య దారి మధ్యలోకి రాగానే అలసిపోయినట్లుగా అనిపించింది. ఓ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని కూర్చున్నాడు. ఆ చెట్టు కింద కూడా తాను ఎలా ధనవంతుడు అవ్వాలనే ఆలోచనే తప్ప మరొకటి లేదు. అలా మెల్లగా కళ్లు మూతలు పడ్డాయి. కొంచెం తీరిక దొరికిందంటే చాలు తను ధనవంతుడు అయినట్టు కలలు కనే భీమయ్య తన వద్ద ఉన్న పాలను అమ్మి ఓ కోడిని కొన్నాడు. కొన్నాళ్లకు అది గుడ్లు పెట్టి పిల్లలను చేసింది. ఆ పిల్లలు పెరిగి పెద్దగా అయ్యాయి. వాటన్నిటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో ఓ మేకని కొన్నాడు. కొన్నాళ్ళకు ఆ మేక కూడా నాలుగు బుజ్జి మేకలకు జన్మనిచ్చింది. భీమయ్య ఆనందానికి అవధులు లేవు. మరికొంత కాలానికి అవి కూడా పెరిగి అలా అలా మేకల మంద తయారైంది. ఆ మేకల మందను అమ్మివేసి వచ్చిన డబ్బుతో రెండు ఆవులను కొన్నాడు భీమయ్య. కొన్నాళ్ళకి అతని దగ్గర ఆవులమంద తయారైంది . ఆ ఆవులను మేపడానికి తన వద్ద ఓ పనివాడిని కూడా పెట్టుకున్నాడు. తాను శ్రీమంతుడా అయ్యేసరికి అందరూ తన మాటే వినాలనే స్థితిలో ఉన్నాడు. ఇంతలో భీమయ్యకు సుశీల అనే అమ్మాయితో పెళ్లి కూడా జరిగింది ఇంతలో అహంకారం పెరిగిన భీమయ్య కావాల్సినంత డబ్బు, చేతికింద పనోడు, అందమైన భార్య. ఇంతకంటే ఈ జీవితానికి ఇంకేం కావాలి. ఇప్పుడు నేను కోటీశ్వరుని నా అంతటి వాడు ఎవరూలేడు అని అనుకుంటున్నాడు. ఇంతలో అటు నుండి వచ్చిన భార్య సుశీల ఇలా ఏవండీ కొంచెం కూరగాయలు తెచ్చి పెడతారా అని అడిగింది. ఆమె మాటలు విన్న భీమయ్య ఏంటే నేను కూరగాయలు తేవడమా? మాతి గాని పోయి మాట్లాడుతున్నాఏమో వెళ్లి మన పనోడి చెప్పు అన్నాడు. అతను ఈ రోజు పనికి రాలేదండీ. కొంచెం మీరే బజారుకు వెళ్లి కూరగాయలతో పాటు వంట సరుకులు తీసుకొస్తారా? అని అంది. ఈసారి తనకు మళ్లీ పని చెప్పేసరికి ధన గర్వంతో, కోపంతో ఊగిపోయిన భీమయ్య ఏంటీ కోటీశ్వరుడైన నాకే బజార్ కి వెళ్ళమని చెప్తావా? నిన్ను అంటూ కాలితో తన్నాడు. అంతే డబాల్ అని పెద్ద శబ్దం వచ్చింది. నిద్ర లేచాడు భీమయ్య. తన్ను తన్నింది పాల క్యాన్ అని గ్రహించాడు. ఆ తన్నుకు పాలన్నీ నేలపాలయ్యాయి .భీమయ్య కల చెదిరింది .ఆశ దోశ అయ్యింది .

నీతి : కలలు కనడం తప్పుకాదు కానీ వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడాలి.
అలాగే ధనం ఉందనే అహంకారం తలకెక్కితే భంగ పడక తప్పదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!