తపస్సుకు సర్వం

తపస్సుకు సర్వం

రచన: నాగ రమేష్ మట్టపర్తి

ఉపాధ్యాయుని బోధనా తపస్సుకు…
దేశ, విశ్వ భవిష్యత్తు మనోహరం…..
విద్యార్థి జ్ఞాన తపస్సుకు…
తన రేపటి భవితం మనోహరం…..
సత్యమైన ప్రేమ తపస్సుకు…
వందేళ్ళ జీవితం మనోహరం…..
స్త్రీ మాతృత్వ తపస్సుకు…
తన భవిష్య తరాలు మనోహరం…..
రైతన్న శ్రమ తపస్సుకు…
పసిడి పుడమితల్లి మనోహరం…..
జవానుని ప్రాణత్యాగ తపస్సుకు…
దేశ శాంతిభద్రతలు మనోహరం…..
గాయకుని గాన తపస్సుకు…
వందల వేల వీనులు మనోహరం…..
చిత్రకారుని కళా తపస్సుకు…
కోట్లాది కనులు మనోహరం…..
కవి కవన తపస్సుకు…
సాహిత్యంతో సమాజం మనోహరం….
సత్పురుషుని ధ్యాన తపస్సుకు…
తన ఈ జన్మ మనోహరం…..

నీవే ” తపస్వి ” వైతే…!
నీ తపస్సుకు… సర్వం ” మనోహరం “…..!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!