నేటి రాజకీయాలు

నేటి రాజకీయాలు

రచన : నెల్లుట్ల సునీత

ఓట్ల పండగ వచ్చిందంటే
నోట్లతో చేతులు తడుపుడే
ప్రజాస్వామ్య విలువల్ని పాతరేసి
వీధివీధిలో రాజకీయ జాతరే

వాగ్దానాల వరాల అంటూ
బీద సాదలకు ఆశ చూపి
నట్టేట్లో ముంచుడే
అభివృద్ధి పనులన్నీ అటకెక్కించి
దౌర్జన్యాలను ముసుగులో
దాగుడుమూతల క్రీడలు

అవినీతి అక్రమాలు
అజమాయిషీలు
రాజ్యమేలుతుంటే
ప్రశ్నించే గొంతుకను
గొంతునులిమి చంపేస్తున్న
వంశ రాజకీయాలు అంట
హింస రాజకీయాలంట
నేటి రాజకీయాలు

విద్యా ఫలాలు అందని
ద్రాక్షగా మారి
నిత్యవసర వస్తువులు
చుక్కలు చూపిస్తూ

అన్ని ఉచితాలు అని
ఊదర గొడుతూ పరోక్షంగా
ప్రజల సొమ్ము దోచేస్తూ
కామ్ ధాన్గా కబ్జాల పర్వాలు

చెప్పుకోడానికి ఏముంది ఘనత
ఇదే మన రాజకీయ చరిత
రాజకీయ రంగుల్లో
ఎన్ని నాటకీయ హంగులో..?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!