చావనివ్వని కల

చావనివ్వని కల

రచన : చిరునవ్వు Rj రాల్స్

రాలిన మనసు నీటి బిందువులై
బలవంతంగా కనురెప్పలను తోసి బయటకొస్తుంటే
నిశీది పరదాలు ఇక చాలని అదుపు చేస్తుంటే
తగిలిన గాయలే గండాలుగా మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ…ఎక్కిళ్లను రప్పిస్తుంటే
నిశ్శబ్దం పాటించమని చేతి వెళ్ళు కంఠాన్ని అధిమిపెడుతుంటే
అసురులు ముందుకొచ్చి చాలీ నాటకాలు అంటుంటే
జీవం ఇక నేనుండనని మేనుతో వాదిస్తుంటే
వ్యర్థమయ్యే కల నన్ను నిలబెట్టని బతిమాలుతుంటే
గతి తోచని మస్తీష్కమ్ గజిబిజినాపుకుని
కలిసోచ్చే కాలం వైపుగా అడుగులు వేయిస్తుంటే
మొహంమీద వెలిసిన విజయకాంతులు
పేదలపైగా జారీ చిరునవ్వుని చిందిస్తుంటే
చిదిరి పోయిన నీటి బిందువుల సమూహం
ఒక్కటిగా మరీ మనసుని మళ్ళీ పుట్టిస్తుంటే
ఇకపై ఎన్నడు వీడనని నీ ఛాయ అల్లరిచేస్తూ నిన్ను హత్తుకుంటే
చాలు చాలు నాకిది చాలని కలవరిస్తుంటే
హఠాత్తుగా కళ్లపై పడిన నీటిచుక్కల తాకిడికి
బ్రతుకు పాఠమనే కలనుండి బయటికొచ్చి
కళ్ళు తెరిస్తే ఎదురుగా అమ్మ ఏంట్రా బాబు
ఇకనైనా నిద్రనుండి లేస్తావా అని అరుస్తుంటే….
నాలో నేను మూసి ముసిగా నవ్వుకుని
ఎంతటి అనుభవమిదని నా పాదాలను
కాలానికి అనుగుణంగా సాగించానో సాధకుడిలా.
జీవితంలో సాధించాలనుకునే కల….
నిద్రలోని ఈ కల ఎప్పటికి చావనివ్వలేవు నా ఈ… కలలు గట్టివి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!