ప్రేమ విశ్వజనీనమైనది

ప్రేమ విశ్వజనీనమైనది

రచన:పసుమర్తి నాగేశ్వరరావు

ప్రేమ ఒక ఆరాధన ప్రేమ ఒక ఆస్వాదన
నేడు ప్రేమతీరు మారింది ప్రేమపేరు మారింది
కాలం మారింది కాల మహిమ మారింది
ప్రేమతీరు తీరం దాటింది

ఒకప్పటి ప్రేమ నిర్వచనం నేడు అనిర్వచనమైంది
ప్రేమ ప్రేమను ప్రేమతో ప్రేమించడం కరువైంది
ప్రేమే ప్రేమను ప్రేరిపించడం లో స్వార్ధం కనిపిస్తుంది
ప్రేమకాని ప్రేమను ప్రేమగా ప్రేమించి ప్రేమకి
ద్రోహం చేసే విధం నేటి ప్రేమలో కనిపిస్తుంది

కానీప్రేమేశాశ్వతం
ప్రేమనుప్రేమతోనే జయించాలి.
ప్రేమ విజయానికి ప్రేమే అవసరం
ప్రేమ ఎప్పటికైనావిశ్వసౌబ్రాతృత్వం కోరుతుంది

ప్రేమ విశ్వజనీనమైనది
వసుధైక రాజ్యస్థాపన కూడా ప్రేమ వల్లే సాధ్యం
ప్రేమను ప్రేమించండి ప్రేమతో అన్నీ సాధించండి
ప్రేమ లక్ష్యం ప్రేమను ప్రేమతో కలిగి ఉండడమే

ప్రేమ సుగంధం వంటిది
ప్రేమ నిత్యం సుగంధ పరిమళం లా ప్రేమను వ్యాప్తి చేస్తుంది
ప్రేమ అనైక్యతను తొలగించి సమైక్యతను పెంచుతుంది

****

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!